సోమవారం నుంచి ఖైదీ నంబర్ 150 మూవీ క్లైమాక్స్ షూట్

  • October 29, 2016 / 02:55 PM IST

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక చిత్రం ఖైదీ నంబర్150 మూవీని మాస్ డైరక్టర్ వి.వి. వినాయక్ అన్ని హంగులతో తెరకెక్కిస్తున్నారు. గత నెల చిరుపై యాక్షన్ సీన్స్, జైలు సన్నివేశాలను చిత్రీకరించిన డైరక్టర్.. కొన్ని రోజుల క్రితం లారెన్స్ ఆధ్వర్యంలో ఓ మాస్ పాటను షూట్ చేశారు.

దీపావళి తర్వాత మరో రెండు పాటల కోసం విదేశాలకు వెళుదామని అనుకున్నారు. కానీ రీసెంట్ గా ప్లాన్ మారిందని తెలిసింది. దీపావళి తర్వాత సోమవారం నుంచి క్లైమాక్స్ సన్నివేశాన్ని షూట్ చేయాలనీ డైరక్టర్ నుంచి సందేశం అందిందని యూనిట్ సభ్యులు ఒకరు చెప్పారు. క్లైమాక్స్ ఫైట్ కి ముందు వచ్చే కొంత డైలాగ్ పార్ట్ ని మొదట చిత్రీకరించి ఆ తర్వాత యాక్షన్ లోకి వెళ్లనున్నట్లు అతను వివరించారు.

క్లైమాక్స్  పూర్తి అయిన వెంటనే వినాయక్ టీమ్ పాటల కోసం విదేశాలకు పయనం కానుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్  ఈ సినిమాను  ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మిస్తున్నారు. కాజల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ సంక్రాంతికి విడుదల కానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus