సినిమా ఇండస్ట్రీలో ప్రేమలు, బ్రేకప్ చాలా కామన్. ముఖ్యంగా బాలీవుడ్ లో ఈ కల్చర్ ఎక్కువగా చూస్తుంటాం. ప్రస్తుతం రణబీర్-అలియా ఎఫైర్ బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు మరో ప్రేమ జంటకి సంబంధించిన మీడియాలో వార్తలు వస్తున్నాయి. వారెవరో కాదు.. కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా. చాలా కాలంగా వీరిద్దరి మధ్య ఎఫైర్ నడుస్తుందని టాక్. అయితే వీరిద్దరూ మాత్రం ఎప్పుడూ బయటపడలేదు. తమ రిలేషన్ షిప్ కి సంబంధించి ఏమైనా ప్రశ్నలు వస్తే తప్పించుకుంటూ వచ్చారు.
అయితే ఈసారి మాత్రం మీడియాకి అడ్డంగా దొరికేశారు. కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా కలిసి నూతన సంవత్సర వేడుకలు సెలబ్రేట్ చేసుకోవడానికి మాల్దీవులకు వెళ్లారు. వీళ్లతో పాటు అనన్య పాండే, ఇషాన్ ఖట్టర్ కూడా వెళ్తున్నారు. కానీ కియారా, సిద్ధార్థ్ లపై మీడియా దృష్టి పడింది. ఎందుకంటే ఎఫైర్ అని వార్తలు వచ్చిన తరువాత ఈ జంట కలిసి మీడియాకి దొరకడం ఇదే మొదటిసారి. ముంబై ఎయిర్ పోర్ట్ దీనికి వేదిక అయింది.
మొత్తానికి ఈ తెరవెనుక ప్రేమాయణంపై అందరి దృష్టి పడింది. మరి వీరి ప్రేమ ఎక్కడివరకు వెళ్తుందో చూడాలి. ఇక సినిమాల విషయానికొస్తే.. ఇటీవల కియారా నటించిన ‘ఇందూకీ జవానీ’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం ఈమె చేతిలో రెండు సినిమాలున్నాయి. సిద్ధార్థ్ మల్హోత్రా కూడా పలు ప్రాజెక్ట్ లతో బిజీగా గడుపుతున్నారు.
Most Recommended Video
2020 Rewind: ఈ ఏడాది సమ్మోహనపరిచిన సుమధుర గీతాలు!
కొన్ని లాభాల్లోకి తీసుకెళితే.. మరికొన్ని బోల్తా కొట్టించాయి!
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!