మతులు పోగొడుతున్న మహేష్ హీరోయిన్!

  • June 18, 2018 / 07:14 AM IST

“భరత్ అనే నేను”లో వసుమతిగా చాలా సాఫ్ట్ గా కనిపించి కనువిందు చేసిన కైరా అద్వానీ క్యూట్ అమ్మాయి అనే ఇమేజ్ ను సొంతం చేసుకొంది. అయితే.. చూడ్డానికి క్యూట్ గా ఉన్నా అమ్మడు బాలీవుడ్ లో చేసిన సినిమాలు అమ్మడికి హాట్ ఇమేజ్ ను తెచ్చిపెట్టాయి. అమ్మడు బాలీవుడ్ లో నటించిన “మెకానిక్” సినిమా చూస్తే అమ్మడి అందాల ఆరబోతకు ఎవరైనా దాసోహమనాల్సిందే. ప్రస్తుతం తెలుగులో వరుస అవకాశాలు దక్కించుకొంటూ ఇక్కడ సెటిల్ అవ్వడానికి ప్రయత్నిస్తోంది. అయితే.. అమ్మడు తెలుగులో నటిస్తున్న రామ్ చరణ్ సినిమా విడుదలకు ఇంకా బోలెడు టైమ్ ఉండడంతో ఈలోపు బాలీవుడ్ లో నెట్ ఫ్లిక్స్ కోసం “లస్ట్ స్టోరీస్” అనే ఒక వెబ్ ఫిలిమ్ లో నటించింది.

అందులో అన్ సాటిస్ఫైడ్ వైఫ్ గా నటించింది అమ్మడు. అనగా భర్త కారణంగా సంసారంలో సంతృప్తి చెందని భార్యామణి అన్నమాట. ప్రస్తుతం ఆ వెబ్ మూవీ లోని రెండు సన్నివేశాలు ఆన్ లైన్ లో హల్ చల్ సృష్టిస్తున్నాయి. భర్త సరైన సుఖాన్ని ఇవ్వకపోవడంతో వైబ్రేటర్ యూజ్ చేస్తుంది కైరా.. అది అందరి ముందు బయటపడిపోతుంది. ఆ సన్నివేశంలో ఎంత కామెడీ ఉందో అంతే హాట్ నెస్ కూడా ఉంది. అలాగే.. క్లీవేజ్ షాట్ కూడా ఒకటి ఉంది. ఈ రెండు సీన్స్ ని కట్ చేసి యూట్యూబ్ లో పెట్టారు. ఈ సీన్స్ ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus