భరత్ అనే నేను, వినయ విధేయ రామ సినిమాలతో తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు కియారా అద్వానీ దగ్గరయ్యారు. చాలా కాలం తర్వాత చరణ్ శంకర్ కాంబో మూవీ ద్వారా కియారా అద్వానీ మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నారు. బాలీవుడ్ లో భూల్ భూలయ్యా, భూల్ భూలయ్యా2 సినిమాల విజయాలతో కియారా అద్వానీ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో కియారా అద్వానీ దెయ్యాల గురించి మాట్లాడుతూ తన లైఫ్ లో జరిగిన షాకింగ్ విషయాలను చెప్పుకొచ్చారు.
తనకు దెయ్యాలంటే భయం లేదని అయితే తాను దెయ్యం సినిమాలను మాత్రం చూడనని ఆమె కామెంట్లు చేశారు. రాత్రి సమయంలో ఒంటరిగా నిద్రపోవాలంటే తనకు భయం వేస్తుందని ఆమె కామెంట్లు చేశారు. ఈ కారణం వల్లే హర్రర్ జోనర్ సినిమాల జోలికి తాను వెళ్లనని కియారా అద్వానీ చెప్పుకొచ్చారు. కాలేజ్ లో చదువుకునే సమయంలో తాను ధర్మశాల అనే ప్రాంతానికి స్నేహితులతో కలిసి టూర్ కు వెళ్లానని ఆమె తెలిపారు.
ధర్మశాలలో మంచు ఎక్కువగా కురుస్తుందని అందువల్ల తాను, తన స్నేహితులు హోటల్ గదికే పరిమితమయ్యామని ఆ సమయంలో తాగడానికి నీళ్లు లేవని హోటల్ గదిలో కరెంట్ కూడా ఉండేది కాదని ఆమె చెప్పుకొచ్చారు. వేడి కొరకు మంట ఏర్పాటు చేసుకుంటే ఆ మంట కూడా ఆరిపోయేదని కియారా అద్వానీ కామెంట్లు చేశారు. నాలుగో రోజు అందరం నిద్రపోతున్న సమయంలో నిప్పు అంటుకుని మంటలు వ్యాపించాయని ఆమె అన్నారు.
ఆ సమయంలో నా స్నేహితురాలు మంటలను చూసి నన్ను, నా స్నేహితులను నిద్ర లేపిందని కియారా అద్వానీ చెప్పుకొచ్చారు. మేము కేకలు వేయడంతో చుట్టుపక్కల వాళ్లు తలుపులు పగలగొట్టి రక్షించారని ఆమె చెప్పుకొచ్చారు. ఆరోజు అదృష్టం కొద్దీ అక్కడి నుంచి బయటపడ్డామని చావును దగ్గరనుంచి చూశామని తనకు అనిపించిందని ఆమె చెప్పుకొచ్చారు. కియారా అద్వానీ చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Most Recommended Video
విక్రమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు నితిన్… ఛాలెంజింగ్ పాత్రలు చేసిన 10 మంది హీరోల లిస్ట్
ప్రభాస్ టు నాని… నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో భారీగా కలెక్ట్ చేసే హీరోలు..!