బాలీవుడ్ జంట కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా ప్రేమలో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే గత కొన్నేళ్లుగా వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నారు. ఇద్దరూ కలిసి సినిమాలు కూడా చేశారు. తరచూ ట్రిప్స్ కి వెళ్తూ మీడియా కంట పడుతుంటారు. వీరికి సంబంధించిన ఫొటోలు బాగా వైరల్ అవుతుంటాయి. వీరి పెళ్లిపై చాలా వార్తలొచ్చాయి కానీ ఎప్పుడూ ఈ జంట బయటపడలేదు. ఇప్పుడు వీరి పెళ్లికి సంబంధించిన ఓ వార్త బాలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది.
వీరిద్దరూ త్వరలోనే ఒక్కటి కాబోతున్నారని వార్తలొస్తున్నాయి. డిసెంబర్ లో ఈ జంట పెళ్లి చేసుకోబోతుందట. గుజరాత్ లోని ఒబెరాయ్ సుఖ్ విల్లా స్పా రిసార్ట్స్ లో వివాహం చేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. ఇదే రిసార్ట్స్ లో బాలీవుడ్ హీరో రాజ్ కుమార్ పెళ్లి జరిగింది. సిద్ధార్థ్-కియారాల వివాహం ముందుగా గోవాలో జరిపించాలని అనుకున్నారు. కానీ ఆ తరువాత సిద్ధార్థ్ ఫ్యామిలీను పరిగణలోకి తీసుకొని గుజరాత్ కి వెన్యూ చేంజ్ చేసినట్లు తెలుస్తోంది.
దీనిపై ఇంకా స్పష్టత రాలేదు. ప్రస్తుతానికైతే దీనిపై ఎలాంటి అధికార సమాచారం లేదు. ఈ ఏడాదిలో వీరి పెళ్లి జరగడం మాత్రం ఖాయమని చెబుతున్నారు. బాలీవుడ్ లో ‘ఎమ్మెస్ ధోని’ సినిమాతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది కియారా అద్వానీ. ఆ తరువాత తెలుగులో రెండు సినిమాలు చేసింది.
బాలీవుడ్ లో బిజీగా ఉండడంతో సౌత్ సినిమాలు కాదత తగ్గించింది. ఇప్పుడు రామ్ చరణ్-శంకర్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. మరోపక్క సిద్ధార్థ్.. ‘యోధ’, ‘మిషన్ మజ్ను’ వంటి సినిమాల్లో నటిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాలు విడుదల కానున్నాయి.