బాలీవుడ్ స్టార్ కపుల్స్ కియారా అడ్వాణీ – సిద్ధార్థ్ మల్హోత్రా.. పెళ్లి పీటలు ఎక్కుతారు అంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. రకరకాల డెడ్‌లైన్స్ కూడా వస్తున్నాయి. ఫలానా తేదీన పెళ్లి ఉండొచ్చు, లేకపోతే ఫలానా తేదీన ఎంగేజ్‌మెంట్ అంటూ రకరకాల వార్తలు పుట్టుకొస్తూనే ఉన్నాయి. అయితే ఇప్పటివరకు ఏదీ అనుకున్నట్లుగా అవ్వలేదు. తాజాగా మరో డెడ్‌లైన్ బయటకు వచ్చింది. అయితే ఈసారి ఆ డేట్ చెప్పింది ఎవరో కాదు.. కియారా అడ్వాణీనే.
సొగసులతో కవ్విస్తూనే, నటనతో ఆకట్టుకోవడం కియారా అడ్వాణీ టాలెంట్. హాట్ ఫొటో షూట్‌లు, అందమైన నటన, ఎప్పుడూ వార్తల్లో నిలిచే రిలేషన్లు.. కియారా అడ్వాణీ సొంతం. అలాంటి కియారా ఆదివారం ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ స్పెషల్ వీడియో షేర్ చేసింది. నాలుగైదు సెకన్ల చిన్న వీడియో క్లిప్‌లో పాల నురగ లాంటి డ్రెస్‌లో కియారా మెరిసిపోయింది. చిరునవ్వులతో సిగ్గుల మొగ్గలా.. ‘రహస్యాన్ని ఎక్కువ కాలం దాచలేను. అతి త్వరలో అంటే డిసెంబరు 2న విషయం వెల్లడిస్తాను. అప్పటిదాకా ఎదురుచూస్తూ ఉండండి’ అనే రాసుకొచ్చింది.
ఈ వీడియోపై అభిమానులు రకరకాలుగా స్పందిస్తున్నారు. సిద్ధార్థ్ మల్హోత్రాతో పెళ్లి విషయాన్ని వెల్లడిస్తుందని కొందరు అంటుంటే, మరికొందరేమో కొత్త సినిమా విషయం చెబుతుంది అని అంటున్నారు. ఇంకొందరు అయితే ఇంకో అడుగు ముందుకేసి ప్రి వెడ్డింగ్ వీడియోలు మనతో పంచుకుంటుందేమో అని అంచనా వేస్తున్నారు. ఈ చిలిపి వీడియో వెనుక అసలు కారణం తెలియాలంటే ఇంకో నాలుగు రోజులు ఆగాల్సిందే. ముందుగా చెప్పినట్లు కియారా అడ్వాణీ గురించి గతంలో చాలా పుకార్లు వచ్చినా..
ఎప్పుడూ ఆమె వైపు నుండి రాలేదు. అయితే తొలిసారి ఆ పరిస్థితి చూస్తున్నాం. సినిమా గురించి చెప్పాలి అనుకుంటే.. ఇలాంటి ఫీట్లు చేయడం మన తారల నుండి గతంలోనూ చూశాం. ఇటీవల కాలంలో అయితే ఇలాంటివి ఎక్కువైపోయాయి. ఏకంగా ప్రెగ్నెన్సీ కిట్లు షేర్ చేస్తూ.. సినిమా ప్రమోషన్స్ చేస్తున్నారు. మళ్లీ ఏమన్నా అంటే.. మా ప్రైవసీ పోతోంది, మనోభావాలు దెబ్బతిన్నాయి అంటున్నారు.
లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!
ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..