ముంబై బ్యూటీ కియారా అద్వానీ తెలుగులో ‘భరత్ అనే నేను’ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది. ఆ తరువాత ‘వినయ విధేయ రామ’ సినిమాలో కనిపించింది. బాలీవుడ్ లో వరుస అవకాశాలు రావడంతో అక్కడే బిజీ అయిపోయింది. ఆమె నటించిన ‘కబీర్ సింగ్’ సినిమా రెండు వందల కోట్లు వసూలు చేయడంతో కియారా క్రేజ్ పెరిగిపోయింది. ప్రస్తుతం ఆమె నటిస్తోన్న చిత్రాల్లో ‘షేర్ షా’ ఒకటి. సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా నటిస్తున్నారు.
తమిళ దర్శకుడు విష్ణువర్ధన్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా చాలాకాలంగా సెట్స్ పైనే ఉంది. పూర్తి స్థాయి యాక్షన్ సినిమా కావడంతో ఎక్కువ సమయం పడుతుంది . ఇప్పుడు ఈ సినిమాకి ఓటీటీ సంస్థ నుండి భారీ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ఈ సినిమాను నేరుగా తమ ప్లాట్ ఫామ్ లో విడుదల చేయాలనుకుంటుంది. ముందుగా ఈ సినిమాను థియేటర్ లోనే రిలీజ్ చేయాలని చిత్రబృందం భావించింది.
కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో థియేట్రికల్ రిలీజ్ రిస్క్ ఏమో అని ఆలోచిస్తున్నారు. ఈ సినిమాపై భారీగా పెట్టుబడి పెట్టారు. యాభై శాతం ఆక్యుపెన్సీతో.. కరోనా సమయంలో ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రావేమో అని డిజిటల్ రిలీజ్ కు రెడీ అవుతున్నారట. పైగా అమెజాన్ భారీ మొత్తాన్ని ఆఫర్ చేయడంతో డీల్ క్లోజ్ చేయాలనుకుంటున్నారు.
Most Recommended Video
విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!