సెలబ్రిటీల సోషల్ మీడియా అకౌంట్లు హ్యాక్ అవ్వడం కొత్తేమీ కాదు. ముఖ్యంగా బాలీవుడ్ సెలబ్రిటీలకు ఇది మరీ ఎక్కువ. అమితాబ్ బచ్చన్, ,షాహిద్ కపూర్ వంటి హీరోల ట్విటర్ అకౌంట్లు హ్యాక్ అయ్యాయి. ఇక సెలబ్రిటీల ఇన్స్టాగ్రామ్, పేస్బుక్ వంటివి కూడా హ్యక్ అవ్వడం మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు తాజాగా మహేష్ బాబు హీరోయిన్ కియారా అద్వానీ అకౌంట్ కూడ హ్యాక్ అయ్యింది. ఈ విషయాన్నీ స్వయంగా కియారా తన ఇన్స్టాగ్రామ్ ద్వారా చెప్పుకొచ్చింది.
ఈ విషయం పై కియారా స్పందిస్తూ.. “’నా ట్విటర్ అకౌంట్ హ్యాక్‌కు గురైయ్యింది. ప్రస్తుతం ఈ సమస్యను పరిష్కరించేందుకు నా టీం పనిచేస్తోంది. నా అకౌంట్ నుంచి వస్తున్న ట్వీట్లను ఎవరు పట్టించుకోకండి. అంతేకాకుండా నా ట్విటర్ అకౌంట్ నుండీ వస్తున్న లింక్‌లను కూడా క్లిక్ చేయవద్దు. ప్రస్తుతం నా ట్విటర్లో వస్తున్న లింక్స్.. నేను పెట్టినవి కావు” అంటూ పేర్కొంది. ప్రస్తుతం ఈమె ‘లక్ష్మీ బాంబ్’ ‘గుడ్ న్యూస్’ ‘ఇందుకి జవానీ’ వంటి బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తూ బిజీగా గడుపుతుంది.