King Of Kotha Collections: ‘కింగ్ ఆఫ్ కొత్త’ 6 రోజుల కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే..?

Advertisement

దుల్కర్‌ సల్మాన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘కింగ్‌ ఆఫ్‌ కొత్త’. పాన్ ఇండియా మూవీగా రూపొందిన ఈ చిత్రంలో ఐశ్వర్య లక్ష్మీ హీరోయిన్ గా నటించింది. ‘జీ స్టూడియోస్’, ‘వేఫేరర్ ఫిల్మ్స్’ బ్యానర్లు ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించాయి. అభిలాష్ జోషి దర్శకుడు. ప్రమోషన్లో భాగంగా విడుదల చేసిన ట్రైలర్ కి సూపర్ రెస్పాన్స్ లభించింది. యాక్షన్ ఎపిసోడ్స్, కె.జి.ఎఫ్ రేంజ్ ఎలివేషన్స్ కూడా ఉంటాయనే భరోసా ఇచ్చింది. అయితే ఆగస్టు 24న విడుదలైన ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది.

సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ తప్ప ఎమోషనల్ కనెక్టివిటీ లేదు అని ప్రేక్షకులు పెదవి విరిచారు. దీంతో ఓపెనింగ్స్ సో సో గానే నమోదయ్యాయి.ఇక వీక్ డేస్ లో ఈ మూవీ కలెక్షన్స్ ఇంకా తగ్గాయని చెప్పాలి. ఒకసారి 6 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే:

నైజాం 0.58 cr
సీడెడ్ 0.24 cr
ఆంధ్ర(టోటల్) 0.69 cr
ఏపీ + తెలంగాణ 1.51 cr

‘కింగ్ ఆఫ్ కొత్త’ (King Of Kotha) చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో రూ.4.45 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 6 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.1.51 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి ఇంకా రూ.3.49 కోట్ల దూరంలో ఉంది అని చెప్పాలి.

మిడ్ రేంజ్ హీరోలు చేసిన ఈ 10 యాక్షన్ సినిమాలు భారీ నష్టాలు మిగిల్చాయని మీకు తెలుసా?

మెహర్ రమేష్ తో పాటు పెద్ద హీరోలు ఛాన్సులు ఇచ్చినా హిట్లివ్వలేకపోయిన డైరెక్టర్ల లిస్ట్.!
రామ్ నీ బాలయ్య ఏమని తిట్టాడో తెలిస్తే షాక్ అవుతారు..!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Also Read

latest news