దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘కింగ్ ఆఫ్ కొత్త’. పాన్ ఇండియా మూవీగా రూపొందిన ఈ చిత్రంలో ఐశ్వర్య లక్ష్మీ హీరోయిన్ గా నటించింది. ‘జీ స్టూడియోస్’, ‘వేఫేరర్ ఫిల్మ్స్’ బ్యానర్లు ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించాయి.అభిలాష్ జోషి దర్శకుడు. ప్రమోషన్లో భాగంగా విడుదల చేసిన ట్రైలర్ కి సూపర్ రెస్పాన్స్ లభించింది.యాక్షన్ ఎపిసోడ్స్, కె.జి.ఎఫ్ రేంజ్ ఎలివేషన్స్ కూడా ఉంటాయనే భరోసా ఇచ్చింది.
అయితే ఆగస్టు 24న విడుదలైన ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది.సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ తప్ప ఎమోషనల్ కనెక్టివిటీ లేదు అని ప్రేక్షకులు పెదవి విరిచారు. దీంతో ఓపెనింగ్స్ సో సో గానే నమోదయ్యాయి.ఇక వీక్ డేస్ లో ఈ మూవీ కలెక్షన్స్ ఇంకా తగ్గాయి. ఒకసారి ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం
0.61 cr
సీడెడ్
0.26 cr
ఆంధ్ర(టోటల్)
0.73 cr
ఏపీ + తెలంగాణ
1.60 cr
‘కింగ్ ఆఫ్ కొత్త’ (King Of Kotha) చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో రూ.4.45 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి వారం పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.1.6 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి ఇంకా రూ.3.4 కోట్ల దూరంలో ఉంది ఈ చిత్రం.