Kiran Abbavaram: మెగాఫోన్‌ పట్టబోతున్న కిరణ్‌ అబ్బవరం.. ఈ టైమ్‌ రిస్కా? లేక మార్క్‌ కోసమా?

తన సినిమాలకు రైటర్‌గానో, దర్శకత్వ విభాగంలోనే కల్పించుకుని పని చేసే హీరోలు దర్శకులుగా మారడం కొత్తేమీ కాదు. కొంతమంది ఈ కోరికను మనసులో దాచుకొని తెలియకుండానే సినిమా పనుల్లో వేలు పెడితే.. మరికొంతమంది సినిమాను డైరెక్ట్‌ చేసేద్దాం అనుకుంటారు. ఇంకొందరైతే సినిమా దర్శకత్వంలో మీద అవగాహన వచ్చేసింది.. ఇప్పుడు నేను మెగా ఫోన్‌ పట్టుకోవచ్చు అనుకుంటారు. ఇంకొందరైతే ఓ కథ సిద్ధమై దర్శకుడు సెట్‌ కాక తానే రంగంలోకి దిగుతారు. మరి వీటిలో ఏం జరిగిందో ఏమో.. యువ కథానాయకుడు కిరణ్‌ అబ్బవరం ఇప్పుడు కెప్టెన్‌ అవుదాం అనుకుంటున్నాడు.

Kiran Abbavaram

రీసెంట్‌గా ‘క’, ‘కె ర్యాంప్‌’ సినిమాలతో విజయం అందుకున్న కిరణ్‌.. ఇప్పుడు ‘చెన్నై లవ్‌ స్టోరీ’ సినిమాతో అలరించడానికి సిద్ధమవుతున్నాడు. త్వరలోనే ఈ సినిమా విడుదలవుతుంది. ఆ సినిమా తర్వాత కిరణ్‌ చేయబోయే సినిమాల గురించి చాలా రోజులుగా రకరకాల పుకార్లు వస్తున్నాయి. ఇప్పుడు వాటిలో ఓన్‌ డైరక్షన్‌ రూమర్‌ యాడ్‌ అయింది. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్‌ పనులు జోరుగా సాగుతున్నాయని టాక్‌.

ఏ లెవల్‌లో సీరియస్‌గా ఈ సినిమా పనులు అవుతున్నాయంటే.. ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ డైరక్టర్‌గా ఫిక్స్‌ చేశారని చెబుతున్నారు. సుధాకర్ చాగంటి ఈ సినిమాను నిర్మించనున్నట్లు సమాచారం. ‘దేవిక అండ్ డానీ’ అనే రొమాంటిక్ హారర్ కామెడీ వెబ్ సిరీస్ ఆయనే నిర్మించారు. ఇప్పుడు కిరణ్‌తో ఓ ప్రాజెక్ట్‌ చేస్తున్నారని టాక్‌.

కిరణ్ అబ్బవరం ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్నట్లు ఆ మధ్య వార్తలొచ్చాయి. కడప నేపథ్యంలో ‘గువ్వల చెరువు ఘాట్’ అనే వెబ్ సిరీస్‌లో లీడ్ రోల్ చేస్తున్నట్లు వార్తలొచ్చాయి. విజయ్ దేవరకొండ, రష్మిక మందన ‘డియర్ కామ్రేడ్’ సినిమా దర్శకుడు భరత్ కమ్మ ఈ సిరీస్‌కి షో రన్నర్‌గా వ్యవహరిస్తారట. ఇవి కాకుండా మరో రెండు సినిమాల చర్చలు తుది దశలో ఉన్నాయి. త్వరలోనే ఈ సినిమాల అధికారిక సమాచారం వస్తుంది.

ఒక్కరే కష్టమంటే.. ‘పెద్ది’ కోసం అంతమంది ‘స్పెషల్స్‌’ కావాలట.. సాధ్యమేనా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus