INDRAPUTRA: కిరణ్‌ అబ్బవరం స్థాయిని పెంచుతున్నాడు… తొలి పాన్‌ ఇండియా టైటిల్‌ ఇదే

ఈ హీరో సినిమాల్లోకి వచ్చిన కొత్తల్లో స్టార్‌ హీరో అవుతాడు అని చాలా తక్కువ మందే అనుకుని ఉంటారు. వాళ్లు అనుకున్నట్లుగానే వరుస సినిమాలకు ఆశించిన ఫలితాలు రాక.. కెరీర్‌ మందుకు వెళ్తుందా అనే డౌటనుమానం కలిగింది. అయితే అనూహ్యంగా పుంజుకున్న ఆ హీరో.. ఇప్పుడు ఏకంగా పాన్‌ ఇండియా సినిమానే స్టార్ట్‌ చేశాడు. ఇప్పుడు ఆ సినిమా టైటిల్‌ను అనౌన్స్‌ చేశారు. ఆ టైటిల్‌ ప్రకారం చూస్తుంటే.. ఈ సినిమా సూపర్‌ పవర్స్‌ ఉన్న సూపర్‌ హీరో సినిమా అని అర్థమవుతోంది. అలాగే ఈ సినిమా ఓ సిరీస్‌ అని కూడా తెలుస్తోంది.

INDRAPUTRA

పైన చెప్పిన ఉపోద్ఘాతమంగా ఇటీవలే ‘చెన్నై లవ్‌స్టోరీ’తో మంచి విజయం, పేరు సంపాదించుకున్న కిరణ్‌ అబ్బవరం గురించే. ఇప్పుడాయన హీరోగా ‘ఇంద్రపుత్ర: ఫస్ట్‌ చాప్టర్‌’ అనే పేరుతో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు శ్రీకాంత్‌ పుప్పాల దర్శకత్వం వహిస్తున్నారు. జీ స్టూడియోస్, ప్రేరణ అరోరా కలసి నిర్మిస్తున్నారు. ఈ సినిమాని ఇటీవల అధికారికంగా ప్రకటించారు. అక్టోబరు నుండి సినిమా రెగ్యులర్‌ చిత్రీకరణ మొదలవుతుంది. వచ్చే ఏడాది రిలీజ్‌ చేస్తారట.

ఈ సినిమా అనౌన్స్‌మెంట్‌ నేపథ్యంలో నిర్మాత ప్రేరణ అరోరా మాట్లాడుతూ మన పురాణాల్లో ధర్మానికి.. అధర్మానికి మధ్య జరిగే పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకుని నేటి ట్రెండ్‌కి తగ్గట్టు నిర్మిస్తున్నామని చెప్పారు. అలాగే ఓ సరికొత్త సినిమాటిక్‌ వరల్డ్‌ని సృష్టించబోతున్నామని కూడా చెప్పారు. ఈ సినిమాలో కిరణ్‌ అబ్బవరం ఓ శక్తిమంతమైన పాత్రలో కనిపించనున్నాడనీ చెప్పారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ జరుగుతోందని ఆ తర్వాత సినిమా షూటింగ్‌ ప్రారంభిస్తామని చెప్పారు.

ప్రస్తుతం కిరణ్‌ అబ్బవరం చేతిలో వరుస సినిమాలు ఉన్నాయి. ఓ వెబ్‌సిరీస్‌ కూడా ఉంది. ఆయన చేతిలో ఉన్న సినిమాల్లో ఒకటి స్వీయ దర్శకత్వంలో రూపొందుతోంది. చేయాల్సిన సినిమాలో సుకుమార్‌ బ్రాండ్‌ నుండి వచ్చిన వీరా కొగటం సినిమా కూడా ఉంది.

జ్వరంతో ఈవెంట్‌కి వచ్చిన కామాక్షి… స్టేజీపైనే కన్నీళ్లు పెట్టుకుంటూ…

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus