40కోట్లు తీసుకుంటున్న క్రిష్!!!

ఒక చిన్న దర్శకుడు, మెగా ప్రొడ్యూసర్ అవతారం ఎత్తి…తీస్తున్న చారిత్రక చిత్రం గౌతమీ పుత్ర శాతకర్ణి…ఇప్పటికే మీకు అర్ధం అయిపోయి ఉండాలి ఆ చిన్న దర్శకుడు ఎవరో…ఆదే మన క్రిష్…గమ్యం సినిమాతో తన గమనాన్ని ప్రారంభించిన క్రిష్ అతి కొద్ది సినిమాలతోనే బాలయ్య లాంటి లెజెండ్ తో సినిమా చేసే అవకాశం దక్కింది. అయితే ఈ సినిమాను క్రిష్ సొంత బ్యానర్ లో నిర్మిస్తున్నాడు. తాజాగా వినిపిస్తున్న వాదన ప్రకారం ఈ సినిమాలో క్రిష్ దాదాపుగా 25కోట్ల వరకూ పెట్టుబడులు పెట్టాడని. అయితే అత్ తక్కువ సమయంలో ఇంత పెద్ద మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టి సినిమా తీస్తున్న క్రిష్ ను చూసి టోటల్ టాలీవుడ్ నివ్వెరపోయింది.

అదే క్రమంలో ఈ మూవీ సక్సెస్ సాధిస్తే క్రిష్ కు దాదాపుగా డబల్ ప్రాఫిట్ వస్తుంది అని, లేదంటే ఎంత కాదనుకున్నా 40కోట్ల వరకూ వాటా వచ్చే అవకాశం ఉంది అని తెలుస్తుంది. ఇక ఈ చిత్రం బాలయ్య 100వ చిత్రం కావడం, మరో పక్క అమరావతి విశిష్టతతో తెరకెక్కుతున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక తాజాగా మోరొక్కోలో మొదటి షెడ్యూల్ ని పూర్తి చేసుకుని, రెండవ షెడ్యూల్‌కు రెడీ అవుతుంది ఈ చిత్రం . అలాగే హీరోయిన్ విషయంలోనూ అధికారికంగా త్వరలోనే ఓ నిర్ణయం రానుందని అంటున్నారు. ఏది ఏమైనా…వచ్చే 2017సంక్రాంతి నందమూరి అభిమానులకు పండగ అనే చెప్పా

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus