Kisi Ka Bhai Kisi Ki Jaan Review: కిసీ క భాయ్ కిసీ క జాన్ ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తూ నిర్మించిన చిత్రం కిసీ క భాయ్ కిసీ క జాన్. ఫర్హద్ సామ్జీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం తమిళంలో సూపర్ హిట్ అయిన వీరం కి రీమేక్ అన్న సంగతి తెలిసిందే. అయితే తెలుగులో ఈ చిత్రాన్ని కాటమరాయుడు పేరుతో రీమేక్ చేశాడు పవన్. ఈ సినిమా పెద్ద ఫ్లాప్ గా మిగిలింది. దీంతో మొదట బాలీవుడ్ లో కూడా ఈ సినిమా పై అంచనాలు పెద్దగా ఏర్పడలేదు. దీనికి తోడు ఓ పాటలో సల్మాన్ ఖాన్ వేసిన స్టెప్పులకి గాను ఓ రేంజ్ లో ట్రోలింగ్ జరిగింది.

టీజర్, ట్రైలర్ (Kisi Ka Bhai Kisi Ki Jaan) వంటివి కూడా అంతే. అయితే చరణ్, వెంకటేష్ వంటి వారు ఉండటంతో ఈ సినిమా పై కొద్దిపాటి అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఆల్రెడీ ఈ చిత్రానికి సంబంధించి కొన్ని చోట్ల షోలు పడ్డాయి. సినిమా చూసిన వాళ్ళు జస్ట్ యావరేజ్ అని చెబుతున్నారు. చరణ్ కనిపించిన పాట మినహా సినిమాలో పెద్ద విషయం లేదని వారు అంటున్నారు. యాక్షన్ డోస్, ఓవర్ సెంటిమెంట్ , విలన్ ట్రాక్ వంటివి చాలా స్లిగా ఉన్నాయని వారు అంటున్నారు.

శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus