ఘనంగా రాహుల్ – అతియా శెట్టి పెళ్లి.. ఫొటోలు చూడండి!

  • January 24, 2023 / 04:09 PM IST

సినిమా సెలబ్రెటీలకు క్రికెటర్లకు ఎంతో విడదీయరాన్ని అనుబంధం ఉంది. ఇప్పటికే ఎంతోమంది క్రికెటర్లు సినిమా సెలబ్రిటీలను వివాహం చేసుకొని సంతోషంగా వైవాహిక జీవితంలో గడుపుతున్నారు. ఈ క్రమంలోనే మరొక క్రికెటర్ బాలీవుడ్ నటి కూడా వైవాహిక బంధంతో కొత్త జీవితంలోకి అడుగు పెట్టారు. బాలీవుడ్ సీనియర్ నటుడు సునీల్ శెట్టి కుమార్తె అతియా శెట్టి క్రికెటర్ కేఎల్ రాహుల్ వివాహం ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. వీరి వివాహ ముంబైలోని అత్యంత విలాసవంతమైన సునీల్ శెట్టి ఖండాల ఫామ్ హౌస్ లో ఎంతో ఘనంగా జరిగింది.

ఇలా వీరి వివాహం సన్నిహితులు కుటుంబ సభ్యుల సమక్షంలో ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. ప్రస్తుతం వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎంతోమంది సినీ క్రికెట్ సెలబ్రిటీలు ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక వీరి వివాహం అనంతరం ఆతీయ శెట్టి సోషల్ మీడియా వేదికగా మొదటిసారి పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సందర్భంగా వీరి పెళ్లి ఫోటోని ఈమె షేర్ చేస్తూ…

నేను ఎలా ప్రేమించాలో నేర్చుకుంటా.. ఈరోజు జీవితంలో ఎంతో అత్యంత విలువైన రోజు సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య మేమిద్దరం ఒక్కటయ్యాం. ఈరోజు మా జీవితంలో మర్చిపోలేని ఆనందాన్ని ఇచ్చింది. మీ ప్రేమ ఆప్యాయతలు, మీ ఆశీర్వాదాలు, కృతజ్ఞతలు మా ప్రయాణంలో తోడుగా ఉండాలని కోరుకుంటున్నాం అంటూ ఈమె పోస్ట్ చేశారు.

ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పలువురు క్రికెటర్లు అలాగే బాలీవుడ్ నటీనటులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus