కోలీవుడ్ స్టార్ హీరో సూర్య సామాజిక అంశాలపై స్పందిస్తుంటాడు. తమ అగరం ఫౌండేషన్ ద్వారా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తుంటాడు. తన సినిమాల ద్వారా ఏదైనా మంచి చెప్పాలని ప్రయత్నిస్తుంటాడు. ప్రస్తుతం సూర్య చేస్తోన్న ఓ సినిమా కూడా సామాజిక సమస్య చుట్టూ తిరిగే కథ అని తెలుస్తోంది. తమిళనాట సంచలనం రేపిన ఓ కేసు ఆధారంగా ఈ కథ నడుస్తుందని సమాచారం. ఈ సినిమాకి నేషనల్ అవార్డు గ్రహీత డైరెక్టర్ పాండిరాజ్ దర్శకత్వం వహిస్తుండగా..
సూర్య తన సొంత నిర్మాణ సంస్థ 2డి ఎంటర్టైన్మెంట్ పై నిర్మిస్తున్నారు. రెండేళ్లక్రితం తమిళనాడులోని పొల్లాచిలో ఓ అమ్మాయిని గ్యాంగ్ రేప్ చేసి చంపేయడం సంచలనం రేపింది. ఈ సంఘటనతో తమిళనాడు అట్టుడికిపోయింది. అప్పటిలో రాజకీయంగా దుమారం రేపింది. కోలీవుడ్ సెలబ్రిటీలు సైతం ఈ సంఘటనపై తీవ్రంగా స్పందించారు. హీరో సూర్య కూడా ఈ ఘటనపై తన వాయిస్ వినిపించాడు. ఇప్పుడు ఆ ఘటన నేపథ్యంలోనే పాండిరాజ్.. సూర్య కొత్త సినిమాకి కథ రాసుకున్నాడట.
ఇందులో సూర్య అమ్మాయిలపై అఘాయిత్యాలకు పాల్పడే వారిని వేటాడే వ్యక్తిగా కనిపిస్తాడట. గతంలో ఇదే కాన్సెప్ట్ తో ‘రాఖీ’ లాంటి సినిమాలు వచ్చాయి. కానీ దర్శకుడు పాండిరాజ్ ట్రీట్మెంట్ డిఫరెంట్ ఉంటుందని అంటున్నారు. ఇందులో సూర్య సరసన ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా కనిపించనుంది.
Most Recommended Video
తన 19 ఏళ్ళ కెరీర్ లో నితిన్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వింటేజ్ ఫిల్మ్ ఫేర్ కవర్స్ పై మన తారలు!
టాలీవుడ్లో రీమేక్ అయిన ఈ 9 సినిమాలు..తమిళంలో విజయ్ నటించినవే..!