పాన్ ఇండియా ఇమేజ్ కోసం దర్శకులు ఇలా చేస్తున్నారా?

  • June 24, 2022 / 06:28 PM IST

టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలలో చాలామంది హీరోలు, డైరెక్టర్లు పాన్ ఇండియా హీరోలుగా, పాన్ ఇండియా డైరెక్టర్లుగా గుర్తింపును సంపాదించుకున్నారు. అయితే మరి కొందరు హీరోలు, దర్శకులకు మాత్రం ఈ గుర్తింపు దక్కాల్సి ఉంది. ప్రస్తుతం టాలీవుడ్ హీరోలు తమిళ డైరెక్టర్ల డైరెక్షన్ లో పని చేయడానికి ఆసక్తి చూపిస్తుండటం గమనార్హం. తమిళ డైరెక్టర్లు సైతం తెలుగు హీరోలతో కలిసి పని చేసి మార్కెట్ ను పెంచుకోవాలని భావిస్తున్నారు. టాలీవుడ్ హీరోలలో ఒకరైన నాగచైతన్య వెంకట్ ప్రభు డైరెక్షన్ లో ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

కృతిశెట్టి హీరోయిన్ గా శ్రీనివాస్ చిట్టూరి నిర్మాతగా భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుంది. హీరో రామ్ లింగుస్వామి డైరెక్షన్ లో ఒక సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ది వారియర్ పేరుతో ఈ సినిమా తెరకెక్కనుండగా ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. తెలుగు, తమిళంతో పాటు కన్నడ భాషల్లో గుర్తింపు తెచ్చుకున్న అర్జున్ విశ్వక్ సేన్ హీరోగా ఒక సినిమాను తెరకెక్కించనున్నారు. ఐశ్వర్య అర్జున్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించనున్నారు.

చరణ్ లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్ లో సినిమాకు సంబంధించి వార్తలు ప్రచారంలోకి వస్తుండగా ఈ వార్తల్లో నిజానిజాలు తెలియాల్సి ఉంది. జూనియర్ ఎన్టీఆర్ అట్లీ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కనుందని వార్తలు ప్రచారంలోకి వస్తున్నా ఈ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది. బన్నీ మురుగదాస్ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కాల్సి ఉంది. రామ్ చరణ్ ఇప్పటికే శంకర్ డైరెక్షన్ లో ఒక సినిమాలో నటించనున్నారు.

తెలుగు డైరెక్టర్లు కూడా తమిళ హీరోలపై దృష్టి పెట్టారు. టాలీవుడ్ హీరోలలో చాలామంది తమిళంలో మార్కెట్ ను పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. తమిళంలో సక్సెస్ కావాలన్న టాలీవుడ్ స్టార్ హీరోల కోరిక నెరవేరుతుందో లేదో చూడాల్సి ఉంది. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న సినిమాలపై నిర్మాతలు సైతం ఎక్కువ మొత్తం ఖర్చు చేస్తున్నారు.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus