Jr NTR: ‘భీమా.. ఇనబడుతుందా..?’ ఎన్టీఆర్ సాంగ్ మాములుగా లేదు!

  • December 24, 2021 / 07:39 PM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ (రౌద్రం… రణం.. రుధిరం). ఈ సినిమా జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో చిత్రబృందం వరుస ప్రమోషనల్ కార్యక్రమాలు చేపడుతోంది. ఎక్కువగా ముంబైలో సినిమాను బాగా ప్రమోట్ చేస్తుంది. అక్కడ స్పెషల్ ఇంటర్వ్యూలు, ప్రీరిలీజ్ ఈవెంట్స్ అంటూ బిజీగా గడుపుతున్నారు.

ఇప్పటివరకు ఈ సినిమా నుంచి మూడు పాటలు విడుదలయ్యాయి. అన్నీ మ్యూజికల్ హిట్సే. ఇప్పుడు సినిమా నుంచి మరో సాంగ్ వచ్చింది. ‘రివోల్ట్ ఆఫ్ భీమ్’ అనే పేరుతో దీన్ని విడుదల చేశారు. ‘భీమా నినుగన్న నేలతల్లి.. ఊపిరిపోసిన సెట్టుసేమా.. పేరుబెట్టిన గోండు జాతి నీతో మాట్లాడుతుర్రా.. ఇనబడుతుందా..?’ అనే డైలాగ్ తో ఈ సాంగ్ మొదలైంది.

‘కొమురం భీముడో.. కొమురం భీముడో.. కొర్రా సూనెగడోలే మండాలి కొడుకో.. మండాలి కొడుకో..’ అంటూ సాగినా ఈ పాట ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటుంది. ఈ ఎమోషనల్ సాంగ్ కి కీరవాణి మ్యూజిక్ అందించగా.. సుద్దాల అశోక్‌ తేజ సాహిత్యం అందించారు. కీరవాణి కొడుకు కాలభైరవ ఆలపించారు. ఆయన వాయిస్ పాటను మరింత ఎలివేట్ చేసింది.

ఈ సినిమాలో భీమ్‌గా ఎన్టీఆర్‌ నటించగా అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్‌ చరణ్‌ కనిపించనున్నారు. ఆలియాభట్‌, ఒలివియా మోరిస్‌ హీరోయిన్లుగా నటించారు. అజయ్‌ దేవ్‌గణ్‌, శ్రియ, సముద్రఖని తదితరులు కీలక పాత్రలు పోషించారు. దాదాపు నాలుగు వందల కోట్ల బడ్జెట్ తో డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మించారు.

శ్యామ్ సింగరాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

83 సినిమా రివ్యూ & రేటింగ్!
వామ్మో.. తమన్నా ఇన్ని సినిమాల్ని మిస్ చేసుకుండా..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus