“జక్కన్న” పై కోనా….ఏమన్నాడంటే….

టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ లో ఒకరైన రాజమౌళి వరుస హిట్స్తో దూసుకుపోతున్నాడు. అదే క్రమంలో ప్రస్తుతం బాహుబలి-2తో బిజీగా గడుపుతున్నాడు. ఇక మరోపక్క కధా రచయిత నుంచి నిర్మాతగా మారిన కోనా వెంకట్ కు ఈ మధ్య అసలు టైమ్ బాలేదు…నిర్మాతగా తొలి సినిమా గీతాంజలి పర్వాలేదు అనిపించినా….ఆ తరువాత సినిమాలు వరుసగా ఫ్లాప్స్ కావడంతో ఎలా అయినా మళ్లీ పాప్యులర్ అవ్వాలి అనుకున్నాడొ ఏమో కానీ, మొత్తానికి రాజమౌళి పైనే శెటైర్స్ వేశాడు…ఇంతకీ ఏమయ్యింది అంటే…రచయితగా నటుడిగా తనకంటూ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఎస్.ఎస్.

రాజమౌళి బ్రదర్ కాంచి దర్శకుడిగా మారి ‘షో టైమ్’ అనే సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈసినిమా టీజర్ మొన్న రిలీజ్ అయింది. సరికొత్తగా ఉన్న ఈ టీజర్ ను ఫర్స్ట్ లుక్ ను చూసి రాజమౌళి ఫిదా అయిపోయాడు. కట్ చేస్తే…రాజమౌళి ఈసినిమాను ప్రమోట్ చేయడానికి రెడీ అవ్వడమే కాకుండా ‘ఒక సినిమాకి ఫస్ట్ లుక్ తో విపరీతమైన ఆసక్తి కలిగించడం చాలా ముఖ్యం. ముఖ్యంగా చిన్న సినిమాలకు ఇది తప్పనిసరి. షోటైమ్ చేసిందదే.’ అంటూ ఒక ఫోటోని పోస్ట్ చేసిన జక్కన్న ట్వీట్ కూడా పెట్టాడు. ఇంతవరకూ బాగానే ఉంది అసలు కధ ఇప్పుడే మొదలయింది….ఈ ట్వీట్ కు కోన వెంకట్ రిప్లై ఇస్తూ…‘రాజమౌళి సార్ మా ‘అభినేత్రి’ ఫస్ట్ లుక్ పోస్టర్ కూడ చూడండి మాసినిమా ‘షో టైమ్’ సినిమాలాగే ఉంటుంది’ అంటూ ట్విట్ చేసాడు.

ఇక ఈ ట్వీట్ పై రకరకాల ఊహాగానాలు ఇండస్ట్రీలో చక్కెర్లు కొడుతున్నాయి…ఈట్విట్ చూసినవారు అంతా తన సినిమాను కూడ ప్రమోట్ చేయమని కోనవెంకట్ రాజమౌళిని అడిగినట్లా లేదంటే రాజమౌళి కజిన్ కాంచి విడుదలచేసిన ‘షో టైమ్’ ఫస్ట్ లుక్ తన ‘అభినేత్రి’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను పోలి ఉంది అని సెటైర్లు వేసినట్లా ? అంటూ ఎవరికి వారు ఊహించేసుకుంటున్నారు…

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus