Jr NTR: ఎన్టీఆర్ సినిమా అప్ డేట్ వచ్చేది అప్పుడేనా..?

  • June 14, 2021 / 04:59 PM IST

కొరటాల శివ జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన జనతా గ్యారేజ్ 2016 సంవత్సరంలో రిలీజై బాక్సాఫీస్ దగ్గర భారీగా కలెక్షన్లను సాధించింది. టాలీవుడ్ ఇండస్ట్రీలోని మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్లలో కొరటాల శివ ఒకరనే సంగతి తెలిసిందే. రేపు కొరటాల శివ పుట్టినరోజు కావడంతో ఎన్టీఆర్ సినిమాకు సంబంధించిన అప్ డేట్ రావచ్చని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరోవైపు మెగా ఫ్యాన్స్ సైతం ఆచార్య సినిమా నుంచి మరో పాట రిలీజవుతుందని అభిప్రాయపడుతున్నారు.

కొరటాల శివ ఎన్టీఆర్ సినిమాలో కియారా అద్వానీ ఫైనల్ అయ్యారని రేపు ఈ మేరకు అధికారిక ప్రకటన రావచ్చని వార్తలు వస్తుండగా ఆ వార్తల్లో నిజానిజాలు తెలియాల్సి ఉంది. కియారా అద్వానీ తాజాగా త్వరలోనే ఒక గుడ్ న్యూస్ చెబుతానని అభిమానులకు చెప్పడంతో ఎన్టీఆర్ సినిమాలో కియారా నటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఎన్టీఆర్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కిన భరత్ అనే నేను సినిమాలో కియారా హీరోయిన్ అనే సంగతి తెలిసిందే.

కమర్షియల్ సినిమాలను సందేశాత్మకంగా తెరకెక్కిస్తూ కొరటాల శివ విజయాలను సొంతం చేసుకుంటూ ఉండటం గమనార్హం. అయితే కొరటాల శివ నుంచి మాత్రం ఇప్పటివరకు రేపు ఏదైనా అప్ డేట్ ఉంటుందని ఎలాంటి ప్రకటన రాలేదు. మరోవైపు బన్నీ కొరటాల శివ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కాల్సి ఉండగా ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందో తెలియాల్సి ఉంది. కొరటాల బన్నీ కాంబో మూవీ కోసం బన్నీ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus