Devara: దేవర ఫ్యాన్స్ కు పూనకాలే అంటున్న కొరటాల శివ.. అసలేమైందంటే?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR)   కొరటాల శివ (Koratala Siva)  కాంబినేషన్ లో తెరకెక్కిన దేవర  (Devara)  సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన సాంగ్స్ అంచనాలను మించి ప్రేక్షకులను మెప్పించిన సంగతి తెలిసిందే. చుట్టమల్లే సాంగ్ కాపీ అంటూ కొన్ని కామెంట్స్ వినిపించినా ఈ సాంగ్ తెలుగు వెర్షన్ కు యూట్యూబ్ లో 43 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఈ సాంగ్ కు రాబోయే రోజుల్లో సైతం రికార్డ్ స్థాయిలో వ్యూస్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది.

Devara

దేవర ఎంట్రీ సాంగ్ అదిరిపోతుందని తారక్ ఎలక్ట్రిఫైయింగ్ గ్రేస్ స్టైల్ అదిరిపోయిందని రత్నవేలు (R. Rathnavelu) ట్వీట్ చేయగా ఆ ట్వీట్ గురించి రామజోగయ్య (Ramajogayya Sastry) రియాక్ట్ అయ్యారు. నువ్వు ఇలా ఫస్ట్ రిపోర్ట్ ఇస్తుంటే ఆ సాంగ్ ఎలా ఉండబోతుందో అర్థమవుతుందని నిన్న రాత్రి నేను కూడా ఈ సాంగ్ షూట్ చూశానని రామజోగయ్య శాస్త్రి చెప్పుకొచ్చారు. మరోవైపు కొరటాల శివ దేవర సినిమాలోని మరో డ్యూయెట్ సాంగ్ కు ఫ్యాన్స్ కు పూనకాలే అని ఈ సినిమాకు పని చేసిన వాళ్లతో చెప్పారని సమాచారం.

దేవర మూవీ నుంచి రాబోయే రోజుల్లో ఇంట్రడక్షన్ సాంగ్, డ్యూయెట్ సాంగ్ రిలీజ్ కానున్నాయని ఈ సాంగ్స్ ఒక సాంగ్ ను మించి మరొకటి ఉంటాయని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇప్పటికే రిలీజైన రెండు సాంగ్స్ ను మించి రాబోయే రోజుల్లో వచ్చే రెండు సాంగ్స్ ఉండనున్నాయని తెలుస్తోంది. అనిరుధ్ (Anirudh Ravichander)    ఈ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో సత్తా చాటాలని భావిస్తున్నారు.

ఈ సినిమా బీజీఎం విషయంలో సైతం అనిరుధ్ స్పెషల్ కేర్ తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది. ఈ నెలాఖరు నాటికి ఈ సినిమాకు సంబంధించిన అన్ని పనులను పూర్తి చేయనున్నారని భోగట్టా. దేవర సినిమా యాక్షన్ ప్రియులకు ఫుల్ మీల్స్ లా ఉండనుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. దేవర సీక్వెల్ కోసం ఫ్యాన్స్ ఒకింత ఆసక్తిగా ఎదురుచూస్తుండగా ఈ ప్రాజెక్ట్ 2026లో సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ అయితే ఉంది.

డల్ అనిపిస్తే ఆ రెండు పనులు చేస్తా.. భాగ్యశ్రీ బోర్సే కామెంట్స్ వైరల్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus