YVS Chowdary: ఒకే సామాజిక వర్గానికి చెందిన హీరోలతో సినిమాలు.. వైవిఎస్ చౌదరి రెస్పాన్స్ ఇది!

వైవీఎస్ చౌదరి (YVS Chowdary) .. టాలీవుడ్ కి చెందిన ఓ సీనియర్ స్టార్ డైరెక్టర్. ‘శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి’ సినిమాతో ఆయన డైరెక్టర్ గా మారారు. ఆ సినిమా సక్సెస్ అందుకుంది. తర్వాత నాగార్జున (Nagarjuna) – హరికృష్ణ (Nandamuri Harikrishna)..లతో ‘సీతారామరాజు’ (Seetharama Raju) అనే మాస్ సినిమా తీశారు. అది కూడా హిట్ అయ్యింది. అటు తర్వాత మహేష్ బాబుతో (Mahesh Babu) ‘యువరాజు’ (Yuvaraju) , హరికృష్ణతో ‘లాహిరి లాహిరి లాహిరిలో’ ‘సీతయ్య’, రామ్ (Ram) తో ‘దేవదాసు’ (Devadasu) వంటి సినిమాలు.. ఈయన్ని స్టార్ డైరెక్టర్ లిస్ట్ లోకి చేర్చాయి.

YVS Chowdary:

అయితే ఆ తర్వాత ఆయన డైరెక్ట్ చేసిన ‘ఒక్కమగాడు'(Okka Magaadu) ‘నిప్పు’ (Nippu) (నిర్మాతగా) ‘సలీమ్’ (Saleem) ‘రేయ్’ (Rey) వంటి సినిమాలు డిజాస్టర్స్ అయ్యాయి. అందువల్ల వైవిఎస్ చౌదరి కెరీర్లో గ్యాప్ వచ్చింది.అయితే దాదాపు 9 ఏళ్ళ తర్వాత వైవీఎస్ చౌదరి.. రీ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయ్యారు.ఆ ప్రాజెక్టుకి బజ్ తెచ్చేందుకు ఇప్పటికే 2 ప్రెస్ మీట్లు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో వైవీఎస్ చౌదరికి ఓ ఘాటు ప్రశ్న ఎదురైంది. అదేంటి అంటే.. చాలా వరకు వైవీఎస్ చౌదరి..

‘ఒకే సామాజిక వర్గానికి చెందిన హీరోలతో సినిమాలు చేస్తారు’ అనే అపోహ ఉంది. దాని గురించి ఓ రిపోర్టర్ లైవ్లో ప్రశ్నించాడు. దీనికి దర్శకుడు వైవీఎస్ చౌదరి బాగా ఫైర్ అయ్యాడు. ‘నేను ఒకే సామాజిక వర్గానికి చెందిన హీరోలతో సినిమాలు చేశాను అనేది అపోహ. ఎందుకంటే.. సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) ఏ సామాజిక వర్గానికి చెందిన వాడు? అంతెందుకు నా భార్య గీత ఏ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తో మీకు తెలుసా?’ అంటూ మండిపడ్డాడు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది.

మరోసారి అలరించేందుకు బాలయ్య రెడీ.. ఈసారి గత సీజన్‌లా కాదట..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus