‘దేవర 2’ ప్రాజెక్టు ఇప్పట్లో ఉంటుందా? లేదా? అనేది ప్రస్తుతానికి డౌట్ గానే ఉంది. అది ఆలస్యం అవుతందనే ఉద్దేశంతోనే..అనుకుంట దర్శకుడు కొరటాల శివ(Koratala Siva) వేరే హీరో కోసం వెతుకులాట మొదలుపెట్టాడు. ఎన్టీఆర్.. ప్రశాంత్ నీల్ సినిమా కోసం ‘దేవర 2’ ని హోల్డ్ లో పెట్టాడు.ఈ గ్యాప్‌లో మరో సినిమా చేయాలని కొరటాల శివ భావిస్తున్నట్టు ఇన్సైడ్ టాక్ నడుస్తుంది.
బాలకృష్ణ -కొరటాల శివ కాంబినేషన్‌లో సినిమా రాబోతుందనే వార్త ప్రస్తుతం ఫిలింనగర్లో గట్టిగానే చక్కర్లు కొడుతోంది. కానీ ఇంకా అధికారిక ప్రకటన అయితే రాలేదు.లేటెస్ట్ టాక్ ప్రకారం.. కొరటాల శివ ఒక పవర్‌ఫుల్ స్క్రిప్ట్‌తో ఇటీవల బాలయ్యను అప్రోచ్ అయ్యారని, అది బాలయ్యకి కూడా నచ్చడంతో సానుకూలంగా స్పందించారని సమాచారం. 2010 లో వచ్చిన బాలయ్య ‘సింహా’ సినిమాకి కొరటాల శివ రైటర్ గా పనిచేశారు.
అప్పటి నుండే బాలయ్య- కొరటాల మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. ప్రస్తుతం బాలయ్య అయితే ఖాళీగా లేరు. గోపీచంద్ మలినేని ప్రాజెక్ట్ ఇటీవల సెట్స్ పైకి వెళ్ళింది. అలాగే క్రిష్ తో ఒక సినిమా అనుకుంటున్నారు. అది ఎప్పుడు స్టార్ట్ అవుతుందనేది ప్రస్తుతానికి డౌటే. అలాగే బాలకృష్ణతో సినిమా చేయడానికి దర్శకుడు బాబీ కూడా మరో పవర్ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేసుకుంటున్నాడు. అలాగే అనిల్ రావిపూడితో మరో సినిమా చేయాలని బాలయ్య ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.
కాబట్టి కొరటాలకి అంత ఈజీగా ఛాన్స్ దొరుకుంటుందా? అనేది ప్రస్తుతానికి డౌటే. కానీ బాలయ్యకి ఉన్న మాస్ ఇమేజ్ కి కొరటాలతో సినిమా చేస్తే బాగానే ఉంటుంది అనేది అభిమానుల కోరిక. మరి ఏమవుతుందో చూద్దాం!