వరుసగా 4 డిజాస్టర్లు రావడంతో రవితేజ పనైపోయిందనే కామెంట్లు వినిపించాయి.అయితే ‘క్రాక్’ చిత్రంతో అలాంటి కామెంట్లకు ఫుల్ స్టాప్ పెట్టాడు మన మాస్ మహా రాజ్. తాను ఒక మాస్ సినిమా చేస్తే.. దాని అవుట్ పుట్ ఎలా ఉంటుందనేది ఈ సంక్రాంతికి ‘క్రాక్’ చిత్రం ద్వారా నిరూపించాడు. ఆల్రెడీ సంక్రాంతి విన్నర్ గా నిలిచినప్పటికీ 24వ రోజులకు కూడా డీసెంట్ రన్ ను కొనసాగిస్తోంది క్రాక్.24వ రోజున ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో 0.13 కోట్ల వరకూ షేర్ ను రాబట్టడం విశేషం.గోపీచంద్ మలినేని డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ‘సరస్వతి ఫిలిమ్స్ డివిజన్’ బ్యానర్ పై బి.మధు నిర్మించగా తమన్ సంగీతం అందించాడు. అతను అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమా సక్సెస్ లో కీలక పాత్ర పోషించిందని చెప్పొచ్చు. సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదలైన ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించడమే కాకుండా.. డబుల్ బ్లాక్ బస్టర్ గా కూడా నిలిచింది. ఈ చిత్రం విజయంతో రవితేజ -గోపీచంద్ లు హ్యాట్రిక్ ను కూడా కంప్లీట్ చేశారు.
ఇక ‘క్రాక్’ చిత్రం 24 రోజుల కలెక్షన్లను ఓ లుక్కేద్దాం రండి :
నైజాం | 11.69 cr |
సీడెడ్ | 5.99 cr |
ఉత్తరాంధ్ర | 4.12 cr |
ఈస్ట్ | 3.19 cr |
వెస్ట్ | 2.38 cr |
కృష్ణా | 2.31 cr |
గుంటూరు | 2.70 cr |
నెల్లూరు | 1.75 cr |
ఏపీ+తెలంగాణ టోటల్ | 34.13 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 1.65 cr |
ఓవర్సీస్ | 0.85 cr |
టోటల్ వరల్డ్ వైడ్ : | 36.63 cr |
‘క్రాక్’ చిత్రానికి వరల్డ్ వైడ్ గా 18 కోట్ల వరకూ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. 24 రోజులకు గాను ఈ చిత్రం 36.63 కోట్ల షేర్ ను రాబట్టింది. 50 శాతం ఆకుపెన్సీతోనే ఈ రేంజ్ కలెక్షన్లను రాబట్టడం అంటే మామూలు విషయం కాదు. ఇప్పటివరకూ ఈ చిత్రం కొన్న బయ్యర్లు 18.63 కోట్ల లాభాలను దక్కించుకున్నారు.అంటే డబుల్ ప్రాఫిట్స్ అన్న మాట.
Click Here To Read Movie Review
Most Recommended Video
30 రోజుల్లో ప్రేమించటం ఎలా? సినిమా రివ్యూ & రేటింగ్!
‘జబర్దస్త్’ కమెడియన్ల రియల్ భార్యల ఫోటోలు వైరల్..!
హీరో, హీరోయిన్ల పెయిర్ మాత్రమే కాదు విలన్ ల పెయిర్ లు కూడా ఆకట్టుకున్న సినిమాలు ఇవే..!