నందమూరి బాలకృష్ణ వందో చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి షూటింగ్ ని శరవేగంగా పూర్తి చేస్తూనే.. దర్శకుడు క్రిష్ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఆగస్ట్ 8న డాక్టర్ రమ్యతో క్రిష్ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఆ తర్వాత వారాల వ్యవధిలోనే తిరిగి షూటింగ్ మొదలుపెట్టేశాడు దర్శకుడు.
ఇంకా క్రిష్-రమ్యల పెళ్లికి వంద రోజుల పండుగ కూడా పూర్తి కాలేదు. ఇప్పుడు శాతకర్ణి హీరోయిన్ శ్రియ చేసిన ఓ పోస్ట్ ఆసక్తి కలిగిస్తోంది. ‘మిసెస్ క్రిష్ తో చివరి రోజు. రమ్య ఎంతో అందమైన వ్యక్తి’ అంటూ.. క్రిష్ వైఫ్ తో కలిసి దిగిన ఫోటోను శ్రియా శరణ్ పోస్ట్ చేసింది. దీనికి ఆమె నుంచి రిప్లై కూడా వచ్చింది. ‘థాంక్య్ లవ్.