నందమూరి నట సింహం బాలయ్య ప్రతిష్టాత్మక 100వ చిత్రానికి దర్శకత్వం వచించడం పెద్ద వరం అయితే…అదే క్రమంలో ఆ సినిమాను సూపర్ డూపర్ హిట్ గా, బ్లాక్ బష్టర్ గా మలచడం, అదీ మెగాస్టార్ వంటి హీరో సినిమా ఎదురుగా ఉన్నప్పటికీ ….శాతకర్ణి ని టాలీవుడ్ టాప్ సినిమాగా మార్చడంలో క్రిష్ టాలెంట్ సూపర్ అనే చెప్పాలి…ఒక్క దెబ్బతో క్రిష్ టాప్ దర్శకుల లిస్ట్ లో స్థానం సంపాదించుకున్నాడు అని చెప్పాలి…ఇదిలా ఉంటే ఇంతటి ఒకపక్క అత్యంత భారీ సినిమాని కేవలం 78రోజులు పూర్తి చేసిన క్రిష్ సామర్ధ్యాన్ని చూసి అందరు క్రిష్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. భారీ యుద్ధాలు, వందలమంది సైనికులు, ఫారిన్ లోకేషన్స్ ‘శాతకర్ణి’ సామ్రాజ్యం ఇలా చాలపెద్ద వర్క్ ఉండే ఈ సినిమాని ఇంత తక్కువ రోజుల్లో క్రిష్ పూర్తి చేయడం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది అని మనకు బలంగా వినిపిస్తుంటే…మరో పక్క క్రిష్ ఈ సినిమాని కాపీ చేసాడని…..కొన్ని విమర్శలు వస్తున్నాయి.
విషయంలోకి వెళితే….బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ, క్రిష్ కు ఉన్న సాన్నిహిత్యంతో బన్సాలీ తీసిన ‘బాజీరావు మస్తానీ’ సినిమాకు సంబంధించి వాడని కొన్ని వార్ సీన్స్ ను క్రిష్ కొంత డబ్బులు చెల్లించి ఆ సీన్స్ ను ‘శాతకర్ణి’ లో తెలివిగా ఎడిట్ చేసి వాడాడని అందువల్లనే ‘శాతకర్ణి’ సినిమాని అంతత్వరగా సమయానికి సినిమా పూర్తి చేయగలిగాడని కొందరు పిచ్చి రాతలు రాయడంతో వాటిపై క్రిష్ స్పందిస్తూ…‘నిజంగా చాలా దారుణమైన రాతలివి. కనీసం ఇంగితం లేకుండా ఇలాంటివి రాస్తున్నారు. వాళ్లకి వాళ్ళే గౌరవాన్ని పోగుట్టుకుంటున్నారు. అయినా ఇంత దారుణంగా ఎలా రాస్తారో అర్ధం కాదు.? సంజయ్ నా ఫ్రెండ్. గ్రేట్ ఫిల్మ్ మేకర్ అది భేస్ చేసుకొని ఇలా ఉహించి రాసేస్తారా? అసలు రాసిన వాళ్ళకి సినిమా పరిజ్ఞానం ఉందా’ అంటూ కోపంతో ఊగిపోయాడు క్రిష్. ఎటువంటి పరిజ్ఞానం లేకుండా కేవలం ఎదుటి వ్యక్తి పై బురద జల్లే ఇలాంటి ప్రయత్నాలను తాను పట్టించుకోను అంటూ సెటైర్లు వేసాడు క్రిష్. మొత్తానికి ఈ విజయాన్ని జీర్ణించుకోలేని యాంటీ ఫ్యాన్స్ ఇలా తమ సైట్స్ లో శాతకర్ణి పై విష ప్రచారం మొదలు పెట్టారు అన్నది అర్ధం అవుతుంది..
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.