Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » ఇంటర్వ్యూ : ‘ది‌ వారియర్’ సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చిన కృతి శెట్టి..!

ఇంటర్వ్యూ : ‘ది‌ వారియర్’ సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చిన కృతి శెట్టి..!

  • July 5, 2022 / 05:19 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఇంటర్వ్యూ : ‘ది‌ వారియర్’ సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చిన కృతి శెట్టి..!

‘ఉప్పెన’ చిత్రంతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి.. మొదటి చిత్రంతోనే బ్లాక్ బస్టర్ అందుకుని టాప్ హీరోయిన్ల లిస్ట్ లో చేరిపోయింది. ఆ తర్వాత ‘శ్యామ్ సింగ రాయ్’ ‘బంగార్రాజు’ వంటి సినిమాలతో మరో రెండు హిట్లు అందుకుంది. త్వరలో ఈమె రామ్ హీరోగా నటించిన ‘ది వారియర్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. జూలై 14న విడుదల కాబోతున్న ఈ చిత్రంలో ప‌వ‌ర్‌ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్ సత్య పాత్రలో రామ్ కనిపించనున్నాడు. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వ‌ర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాసా చిట్టూరి నిర్మించారు. తెలుగుతో పాటు తమిళంలో కూడా ఏకకాలంలో విడుదల కానున్న ఈ చిత్రం గురించి కృతి శెట్టి ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చింది. ఆ విశేషాలు మీ కోసం :

ప్ర) డిసెంబర్‌లో ‘శ్యామ్ సింగ రాయ్’, జనవరిలో ‘బంగార్రాజు’… ఇప్పుడు ‘ది వారియర్’… మీ సినిమాలు వరుసగా రిలీజ్ అవుతున్నాయి. మీకు ఎలా అనిపిస్తుంది?

కృతి శెట్టి: ‘శ్యామ్ సింగ రాయ్’, ‘బంగార్రాజు’ వెంట వెంటనే రిలీజ్ అయ్యాయి కదా! కాబట్టి.. చాలా గ్యాప్ వచ్చినట్టు అనిపిస్తుంది.

ప్ర) ఈ కథ విన్న తర్వాత ఏమనిపించింది? మీ ఫీలింగ్ ఏంటి?

కృతి శెట్టి: లింగుస్వామి గారు తీసిన ‘ఆవారా’ ను చాలా ఏళ్ళ క్రితం తమిళంలో చూశా. మా అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళినప్పుడు ఆ సినిమా సీడీ తీసుకువెళ్ళి రోజుకి రెండు మూడు సార్లు చూసేదాన్ని.ఆ మూవీ నాకు ఓ మధుర జ్ఞాపకం.ఒకరోజు లింగుస్వామి గారు ఫోన్ చేశారు అని మా అమ్మ చెప్పినప్పుడు చాలా ఎగ్జైట్ అయ్యాను. ఎందుకంటే… ఆయన సినిమాలు చాలా ఎంట‌ర్‌టైనింగ్‌గా ఉంటాయి. హీరోయిన్లకు పెర్ఫార్మన్స్‌కు స్కోప్ ఉన్న పాత్రలు ఉంటాయి. కథ విన్న తర్వాత ఇంకా ఎగ్జైట్ అయ్యాను.

ప్ర) ‘బుల్లెట్…’ సాంగ్ కి రెస్పాన్స్ వచ్చింది. రీల్స్, యూట్యూబ్ షార్ట్స్… ఎక్కువగా వచ్చాయి.ఆ సాంగ్ షూటింగ్ చేసేటప్పుడు మీరు ఎలా ఎంజాయ్ చేశారు?

కృతి శెట్టి: ఆ సాంగ్ షూటింగ్ స్టార్ట్ చేయడానికి ముందు నేను నెర్వస్ ఫీలయ్యాను.ఎందుకంటే రామ్ గారి ఎనర్జీ మ్యాచ్ చేయాలి అంటే మనలో కూడా ఎనర్జీ కావాలి. కానీ, షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఒక ఫ్లో లో వెళ్ళిపోయింది అనిపించింది. ఎంజాయ్ చేస్తూనే ఆ సాంగ్ చేశాను. ‘బుల్లెట్…’ సాంగ్ క్లాస్ అయితే, ‘విజిల్…’ సాంగ్ మాస్. నాకు ఎక్స్ట్రా ఎనర్జీ కావాలని అనుకున్నప్పుడు విజిల్ సాంగ్ పెట్టుకుని డాన్స్ చేస్తుంటాను. ‘బుల్లెట్…’ సాంగ్ స్టైలిష్ గా ఉంటుంది.అలాగే ఈ సినిమాలో పాటలకు ముందు వచ్చే సీన్స్ బాగుంటాయి.

ప్రశ్న: ‘ది వారియర్’ లో మీ పాత్ర ఎలా ఉండబోతుంది?

కృతి శెట్టి: ‘ది వారియర్’ లో నా పాత్ర అందరూ మెచ్చే విధంగా ఉంటుంది . గాళ్ నెక్స్ట్ డోర్, క్యూట్ రోల్. కథ విన్న వెంటనే నేను కనెక్ట్ అయ్యాను. ప్రేక్షకులు కూడా కనెక్ట్ అవుతారని అనుకుంటున్నాను. సినిమా చూసినప్పుడు మన ఇంట్లో అమ్మాయి లేదా పక్కింటి అమ్మాయి విజిల్ మహాలక్ష్మి పాత్ర ఉంటుంది. ఆర్జే గా ఈ మూవీలో కనిపిస్తాను.

ప్రశ్న: రామ్ పోలీస్ రోల్ చేశారు. మీది ఆర్జే రోల్. ఇద్దరి మధ్య ప్రేమ ఎలా చిగురించింది?

కృతి శెట్టి: పోలీస్ స్టేషన్, రేడియో స్టేషన్… మధ్యలోని రైల్వే స్టేషన్‌లో! బహుశా… అక్కడ ప్రేమ పుట్టి ఉండవచ్చు.(నవ్వుతూ)

ప్రశ్న: ఆర్జే రోల్ కోసం ఏమైనా హోమ్ వర్క్ చేశారా?

కృతి శెట్టి: తెలుగు ఆర్జే వీడియోస్ చాలా చూశాను. వాయిస్ వినిపించినప్పుడు ఆర్జే కనిపించకపోయినా… ఎక్స్‌ప్రెష‌న్‌ ఫీల్ అవ్వాలి. అది గమనించాను. ఫారిన్ ఆర్జే వీడియోస్ చూశా. పాడ్ కాస్ట్ వీడియోస్ చూశా. ఇలా ఈ పాత్ర కోసం కొంచెం వర్క్ చేశాను

ప్రశ్న: ఈ సినిమాకు ముందు రామ్ నటించిన సినిమాలు ఏమైనా చూసారా?

కృతి శెట్టి: చూశాను. ‘ఇస్మార్ట్ శంకర్’, ‘రెడీ’, ‘హలో గురు ప్రేమ కోసమే’ – ఇంకా చాలా సినిమాలు చూసాను. నేను తెలుగు నేర్చుకోవాల్సిన సమయంలో తెలుగు సినిమాలు చాలా చూసేదాన్ని.

ప్రశ్న: రామ్‌తో వ‌ర్కింగ్ ఎక్స్‌పీరియ‌న్స్‌ ఎలా ఉంది?

కృతి శెట్టి: ఆయన ఎనర్జీతో గురించి అందరికీ తెలిసిందే. మొదట్లో కొంచెం నెర్వస్ ఫీలయ్యాను. కానీ, హి ఈజ్ వెరీ కూల్.

ప్రశ్న: దర్శకుడు లింగుస్వామి గురించి చెప్పండి…?

కృతి శెట్టి: ఆయన చాలా క్లారిటీ ఉన్న వ్యక్తి. ఒక్కోసారి ఆయన కోరుకున్నట్టు షార్ట్ రాకపోతే ఆయనే నటించి మరీ చూపిస్తారు. వాయిస్ మాడ్యులేషన్ కూడా చేశారు.

ప్రశ్న: సినిమాలో ఆది, నదియా కూడా నటించారు కదా వాళ్ళ పాత్రల గురించి చెప్పండి?

కృతి శెట్టి: ఆది పినిశెట్టి విలన్ రోల్ చేశారు. ఆయనతో నాకు కాంబినేషన్ సీన్స్ ఉండవు. సెట్స్‌ లో మాత్రం ఆయన చాలా సాఫ్ట్‌గా ఉంటారు. ఒకసారి యాక్షన్ అనగానే ఆయన బాడీ లాంగ్వేజ్ మొత్తం మారిపోతుంది.ఈ సినిమాలో ఆయన అద్భుతంగా నటించారు. రామ్ తర్వాత నాకు నదియా గారితో ఎక్కువ సన్నివేశాలు ఉన్నాయి. ఆమె చాలా రాయల్‌గా ఉంటారు.

ప్రశ్న:ఈ చిత్రంతో కోలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు.దీని పై మీ ఫీలింగ్…?

కృతి శెట్టి: ‘ఉప్పెన’ టైమ్ నుండి కోలీవుడ్లో ఆఫర్లు వస్తున్నాయి. అక్కడి ప్రేక్షకుల నుండి ఎక్కువ ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ చిత్రాన్ని తమిళ ప్రేక్షకులు కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాను. ఇప్పుడు మరో తమిళ సినిమా చేస్తున్నాను. అందులో సూర్య గారు హీరో.అలాగే మరో బై లింగ్యువల్ మూవీ నాగచైతన్య, వెంకట్ ప్రభు కాంబినేషన్లో చేస్తున్నాను. కాబట్టి ఇప్పుడు తమిళ్ కూడా నేర్చుకుంటున్నాను.

ప్రశ్న: ‘ది వారియర్’ నిర్మాతలతో మరో సినిమా చేస్తున్నారు? దాని గురించి చెప్పండి…?

కృతి శెట్టి: వెరీ నైస్ ప్రొడక్షన్ హౌస్. కాంప్రమైజ్ కాకుండా లావిష్, రిచ్ గా సినిమా తీశారు. మా నిర్మాత శ్రీనివాసా చిట్టూరి కి సినిమా అంటే అమితమైన ప్రేమ. ఆయన తక్కువ మాట్లాడతారు. సినిమా కోసం ఎక్కువ ఖర్చు పెట్టి ఆయన ప్రేమను చూపిస్తారు.

ప్రశ్న: రెండు భాషల్లో షూటింగ్ చేయడం కష్టం అనిపించిందా?

కృతి శెట్టి: నా కంటే రామ్ ఎక్కువ కష్టపడ్డారు. నేను లిప్ సింక్ ఇస్తే సరిపోతుంది. కాబట్టి నాకు ఈజీ.కానీ రామ్ కు అలా కాదు… ప్రతి సీన్, డైలాగ్ విషయంలో ఆయన కష్టపడ్డారు.

ప్రశ్న: ఫైనల్ గా… ‘వారియర్’ చూసి ప్రేక్షకులు ఎలా రియాక్ట్ అవుతారు అని అనుకుంటున్నారు?

కృతి శెట్టి: ప్రేక్షకుల రియాక్షన్ చూసి నేను విజిల్స్ వేసేలా ఉంటుంది. అది మాత్రం పక్కాగా చెప్పగలను.

ప్రశ్న: మీ డ్రీమ్ రోల్ ఏమైనా ఉందా?

కృతి శెట్టి: భవిష్యత్తులో యాక్షన్ రోల్స్ చేయాలని ఉంది. ‘ది వారియర్’ తర్వాత ‘మాచర్ల నియోజకవర్గం’ తో ప్రేక్షకుల ముందుకు వస్తాను.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aadhi Pinnishetty
  • #Akshara Gowda
  • #DSP
  • #Krithi Shetty
  • #Lingusamy

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

45 mins ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

5 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

6 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

7 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

3 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

4 hours ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

5 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version