బాహుబలి కంక్లూజన్ పై ప్రభాస్ పెద్దమ్మ ఏమి చెప్పారో తెలుసా ?

  • April 29, 2017 / 02:04 PM IST

బాహుబలి కంక్లూజన్ సినిమాని చూసిన ప్రతి ఒక్కరూ రాజమౌళి దర్శకత్వ ప్రతిభను, ప్రభాస్ నటనను కీర్తిస్తున్నారు. భాషాబేధం లేకుండా సినీ స్టార్స్ అభినందనలతో ముంచ్చెత్తున్నారు. ఇక ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి (కృష్ణం రాజు భార్య) ఫస్ట్ డే నాడు సినిమాని చూసి తన ఆనందాన్ని మీడియాతో పంచుకున్నారు. “ప్రపంచమంతా ఒకటే మాట, ఇంతటి అద్భుతమైన సినిమాని ఎవరూ తీయరు, తీయలేరు. సూర్య చంద్రులు ఉన్నంతవరకు రాజమౌళి, ప్రభాస్ పేరు నిలిచి పోతుంది. కోహినూరు వజ్రానికి ఎలా ధర కట్టలేమో, అలాగే వారిద్దరికీ వెలకట్టలేము. ప్రభాస్ తో పాటు అనుష్క, సత్యరాజ్, రమ్యకృష్ణ ప్రతి ఒక్కరూ చక్కగా నటించారు. మనం అందరం గర్వించదగ్గ సినిమా ఇది. బాహుబలి టీమ్ సభ్యులందరూ వెయ్యి ఏనుగుల బలంతో వర్ధిల్లాలి” అని ఆశీర్వదించారు.

ఇక ప్రభాస్ గురించి మాట్లాడుతూ “అమరేంద్ర బాహుబలి పాత్రకు ప్రభాస్ ప్రాణం పోసాడు. అతను చనిపోతూ రాజఠీవి తో జై మహిష్మతి అని చెప్పే సీన్ నాకు బాగా నచ్చింది, అతను మా బిడ్డ అని చెప్పుకోవడానికి మేము గర్వపడుతున్నాం. ఉప్పలపాటి వంశానికి ప్రభాస్ దేవుడిచ్చిన వరం.” అని  శ్యామలాదేవి ఆనందాన్ని వ్యక్తం చేశారు.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus