ఉప్పెన సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ అయిపోయిన కృతి శెట్టి రేంజ్ ఒక్కసారిగా ఇండస్ట్రీలో పెరిగిపోయింది. అంతేకాదు సోషల్ మీడియా లో ఎక్కడ చూసినా ఈ హీరోయిన్ ఫోటోలు చక్కర్లు కొట్టేవి.. అంతలా ఫ్యాన్స్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఇన్స్టాగ్రామ్ లో 5.5 మిలియన్ల ఫాలో అవర్స్ ఉన్నారు. ఎప్పటికప్పుడు అభిమానులతో సోషల్ మీడియాలో ముచ్చటిస్తూనే ఉంటుంది ఈ అమ్మడు. ఆ తర్వాత వచ్చిన రెండు సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ అవడంతో ఇండస్ట్రీ ని ఏలే హీరోయిన్ గా మారుతుందని అందరూ భావించారు.
కానీ అందుకు భిన్నంగా ఈ హీరోయిన్ తర్వాత వచ్చిన మూడు సినిమాల తో ఐరన్ లెగ్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. ఇక ఈ మధ్యకాలం లో వచ్చిన కస్టడీ సినిమా కూడా ఈ హీరోయిన్ కి అంతగా ప్లస్ అవ్వలేదు. రీసెంట్ గా కస్టడీ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తనకు కాబోయే భర్త గురించి రివిల్ చేసింది కృతి శెట్టి . తన కాబోయే భర్తకు పెద్దగా ఆస్తి ఉండక్కర్లేదట ..
అందంగా కూడా ఎక్కువగా ఉండక్కర్లేదట ..కానీ బొద్దుగా ఉంటే చాలా ఇష్టమట. చభీ చబ్బీ గా బుగ్గలు పెద్దపెద్దగా ఉంటే కృతిశెట్టికి చాలా ఇష్టమట . మంచి మనసు ఉండాలి అని,, ఫైనాన్షియల్ స్టేటస్ బాగో లేకపోయినా కానీ మంచి మనసు ఉంటే ఉంటే అదే ఇష్టముంటుంది కృతిశెట్టి . దీనితో మరోసారి కృతిశెట్టి పేరు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అందాల ముద్దుగుమ్మ (Krithi Shetty) కృతి శెట్టి. పేరుకు కన్నడ బ్యూటీనే అయినా ..తెలుగులో నటించే అవకాశాలు అందుకున్న కృతి శెట్టి స్టార్ బ్యూటీ గా మారిపోయింది. ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా మారిపోవడానికి ట్రై చేస్తోంది. ఈ బ్యూటీ భర్త గురించి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు కూడా ఓ ఆట ఆడేసుకుంటున్నారు.