కెరీర్ ఊపందుకోవడానికి ఒకే ఒక్క సినిమా చాలు. బాక్సాఫీస్ వద్ద సరైన హిట్ పడితే వారికి అడ్డే ఉండదు. ఇక ఉప్పెన సినిమా అనంతరం హీరోయిన్ కృతి శెట్టి కెరీర్ కూడా ఇప్పుడు అదే ఉపులో కొనసాగుతోంది. మొదటి సినిమా రిలీజ్ కాకముందే అమ్మడు రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నాని శ్యామ్ సింగరాయ్ సినిమాతో పాటు శర్వానంద్ తో మరో సినిమా చేయడానికి రెడీ అవుతోంది. ఉప్పెన రిలీజ్ అనంతరం అమ్మడకి డిమాండ్ మరింత పెరిగింది.
ఆఫర్స్ మామూలుగా రావడం లేదు. కానీ కృతి పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాలనే ఎంచుకుంటోంది. ఇక రామ్ పోతినేనితో ఒక ద్విభాషా చిత్రం చేయదనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ సినిమా కోసం అమ్మడు భారీ రెమ్యునరేషన్ అందుకుంటోందట. ఉప్పెన హిట్టు తరువాత వచ్చిన ఆఫర్ కాబట్టి 80 లకక్షలకు పైగానే అందుకుంటున్నట్లు టాక్. ఇది ఎంతవరకు నిజమో తెలియదు గాని ఆమెకు కోటి ఇచ్చిన తక్కువ కాదని మరికొందరు ఆఫర్స్ ఇస్తున్నట్లు సమాచారం.
కానీ కృతి మాత్రం టెంప్ట్ అవ్వకుండా సరైన సినిమాలను సెలెక్ట్ చేసుకుంటోంది. ఇక శ్యామ్ సింగరాయ్ సినిమాలో మరో హీరోయిన్ సాయి పల్లవితో కృతి స్క్రీన్ షేర్ చేసుకుంటోంది. ఆ సినిమాపై కూడా అంచనాలు గట్టిగానే ఉన్నాయి. మరో రెండు హిట్స్ అందుకుంటే కృతి ఈజీగా స్టార్ హీరోయిన్స్ కు పోటీ ఇవ్వగలదని చెప్పవచ్చు.