Krithi Shetty: కృతిని హీరోయిన్ గా అనుకున్నారు కానీ..!

  • May 27, 2021 / 07:36 PM IST

రెండు రోజులుగా మెగాహీరో సాయి ధరమ్ తేజ్ సరసన కృతిశెట్టి హీరోయిన్ గా నటించబోతున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇందులో నిజం లేదంటూ కృతి మేనేజర్ క్లారిటీ ఇచ్చారు. ‘ఉప్పెన’ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన కృతిశెట్టికి టాలీవుడ్ లో డిమాండ్ బాగా పెరిగింది. ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ తో రొమాన్స్ చేసిన కృతి త్వరలోనే తన వైష్ణవ్ సోదరుడు సాయి ధరమ్ తేజ్ తో నటించబోతున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి.

ఈ వార్తలపై స్పందించిన కృతి మేనేజర్ అసలు ఇలాంటి వార్తలు ఎలా సృష్టిస్తారో అంటూ అసహనం వ్యక్తం చేశారు. రీసెంట్ గా కృతి స్వయంగా తన సోషల్ మీడియా అకౌంట్ లో ఇలాంటి ఫేక్ వార్తలను నమ్మొద్దని.. ఏదైనా ప్రాజెక్ట్ ఒప్పుకుంటే తనే నేరుగా చెబుతానని క్లారిటీ ఇచ్చింది. అసలు ఈ వార్త ఎలా పుట్టుకొచ్చిందంటే.. సాయి ధరమ్ తేజ, భోగవల్లి ప్రసాద్ సినిమా ప్రతిపాదన వచ్చినపుడు ‘ఉప్పెన’ సినిమా ఇంకా రిలీజ్ కాలేదు.

అప్పటికి కృతిశెట్టికి అంత క్రేజ్ కూడా రాలేదు. అలాంటి సమయంలో హీరోయిన్ గా ఆమె పేరుని పరిశీలించారట. ఆ విషయాన్ని సాయి ధరమ్ తేజ్ తో చెప్పగా.. తమ్ముడి పక్కన నటిస్తోన్న అమ్మాయితో కలిసి పని చేయడం అంత బాగోదేమోనని సందేహం వ్యక్తం చేశారట. దీంతో కృతికి బదులుగా మరో కొత్త హీరోయిన్ ను తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. అదన్నమాట మేటర్!

Most Recommended Video

ఏక్ మినీ కథ సినిమా రివ్యూ & రేటింగ్!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus