Krithi Shetty: ‘ఉప్పెన’ బ్యూటీ కృతి శెట్టికి అలాంటి అబ్బాయిలే నచ్చుతారట..!

  • May 24, 2021 / 05:27 PM IST

‘ఉప్పెన’ తో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ కృతి శెట్టి. బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంతో మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ కూడా హీరోగా పరిచయం అయ్యాడు. వసూళ్ళ పరంగా కూడా ఈ చిత్రం సరికొత్త రికార్డులు సృష్టించింది. కృతిశెట్టి ఈ చిత్రంతో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది అనే చెప్పాలి.ఇంకో హిట్ పడితే కచ్చితంగా ఈమె స్టార్ హీరోయిన్ అయిపోవడం..

వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు కొట్టేయడం ఖాయంగా కనిపిస్తుంది. అందంతో పాటు మంచి హావభావాలు కూడా పలికించగల సమర్థురాలు కృతి శెట్టి. ప్రస్తుతం ఈ అమ్మడు నానితో ‘శ్యామ్ సింగరాయ్’, సుధీర్ బాబుతో ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ వంటి చిత్రాల్లో నటిస్తోంది. వాటితో పాటు ఎనర్జిటిక్ స్టార్ రామ్- లింగుస్వామి కాంబినేషన్లో రూపొందుతున్న సినిమాలో కూడా ఈమె హీరోయిన్ గా నటిస్తుంది. ఇదిలా ఉండగా.. తాజాగా ఈమె సోషల్ మీడియాలో సందడి చేసింది.

ఎప్పుడూ యాక్టివ్ గానే ఉంటుందన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సారి ఫ్యాన్స్ తో చిట్ చాట్ సెషన్ ను నిర్వహించింది. ఈ క్రమంలో తనకు .. ఎలాంటి అబ్బాయిలు నచ్చుతారో కూడా చెప్పుకొచ్చింది. ‘అబద్ధాలు చెప్పే అబ్బాయిలంటే తనకు చిరాకు అని తెలిపిన కృతి.. నిజాయితీగా నిర్భయంగా ఉన్నది ఉన్నట్టు మాట్లాడే అబ్బాయిలంటే ఇష్టమని’ చెప్పుకొచ్చింది.

Most Recommended Video

టాలీవుడ్ స్టార్ హీరోల ఫేవరెట్ ఫుడ్స్ ఇవే..?
ఈ 10 సినిమాల్లో కనిపించని పాత్రలను గమనించారా?
2020 లో పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కానీ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus