కృతి కర్బంద.. మోడలింగ్ నుండి సినిమా ఫీల్డ్‌లోకి వచ్చింది. ఫస్ట్ టాలీవుడ్ మూవీతోనే హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. 2009లో సుమంత్ హీరోగా వచ్చిన ‘బోణి’ తన మొదటి సినిమా.. తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘తీన్ మార్’, ఉస్తాద్ రామ్ ‘ఒంగోలు గిత్త’ లో హీరోయిన్గా.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘బ్రూస్ లీ’ లో అక్క క్యారెక్టర్ చేసింది. తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ భాషల్లోనూ నటించింది..
కొద్ది కాలంగా తెలుగులో మూవీస్ చెయ్యట్లేదు కృతి.. బాలీవుడ్లో తనతో కలిసి మూడు సినిమాలు చేసిన నటుడు పుల్కిత్ సామ్రాట్‌తో 2019 నుండి డేటింగ్ చేస్తోంది. వీళ్లు త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నారని సమాచారం.అక్టోబర్ 29న కృతి తన 32వ బర్త్‌డే జరుపుకుంటోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో లేటెస్ట్ పిక్స్ షేర్ చేస్తూ.. ఫ్యాన్స్, నెటిజన్లకు టచ్‌లో ఉంటుంది. తను పోస్ట్ చేసే గ్లామరస్ ఇమేజెస్ వైరల్ అవుతుంటాయి. కృతి పుట్టినరోజు సందర్భంగా కో స్టార్స్ విషెస్ తెలియజేస్తున్నారు.