KTR, Dilraju: వాళ్లిద్దరూ దిల్ రాజును తొక్కేస్తున్నారా.. అసలేం జరిగిందంటే?

  • March 1, 2023 / 09:09 PM IST

టాలీవుడ్ ఇండస్ట్రీలో నంబర్ వన్ స్టార్ ప్రొడ్యూసర్ ఎవరనే ప్రశ్నకు దిల్ రాజు పేరు సమాధానంగా వినిపిస్తుంది. దిల్ రాజు వరుసగా పాన్ ఇండియా ప్రాజెక్ట్ లతో నిర్మాతగా బిజీ అవుతున్నారు. దిల్ రాజు బ్యానర్ లో తెరకెక్కిన బలగం మూవీ ఈ నెల 3వ తేదీన రిలీజ్ కానుండగా ఈ వారం విడుదలవుతున్న సినిమాలలో ఈ సినిమాపైనే ఎక్కువగా అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరగగా కేటీఆర్ ఈ ఈవెంట్ కు గెస్ట్ గా హాజరయ్యారు.

వేణు మంచి కమెడియన్ గా తనకు సుపరిచితమని అయితే వేణు ఇంత మంచి మూవీ తీస్తాడని ఊహించలేదని కేటీఆర్ అన్నారు. తక్కువ బడ్జెట్ తో వచ్చిన చిన్న సినిమాలే పెద్ద సినిమాలకు షాకిస్తాయని ఉప్పెనలా ఊపేస్తాయని కేటీఆర్ కామెంట్లు చేయగా ఆ కామెంట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. బలగం సినిమాకు దిల్ రాజు కుటుంబ సభ్యులు హన్షిత్ హర్షిత నిర్మాతలు కాగా వాళ్లు దిల్ రాజును తొక్కేస్తున్నారని కేటీఆర్ పేర్కొన్నారు.

కేటీఆర్ సరదాగా ఈ కామెంట్లు చేశారు. హన్షిత్ హర్షిత కూడా నిర్మాతలుగా మంచి గుర్తింపును సంపాదించుకోవాలని ఆయన అన్నారు. భీమ్స్ ఎన్నో కష్టాలు పడి ఈ స్థాయికి వచ్చారని ఇండస్ట్రీలో భీమ్స్ పేరు తెచ్చుకోవాలని ఆయన కామెంట్లు చేశారు. తెలంగాణ భాషకు గౌరవం దక్కడం సంతోషాన్ని కలిగిస్తోందని కేటీఆర్ పేర్కొన్నారు.

కేటీఆర్ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బలగం సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కగా ఈ సినిమా ఏ రేంజ్ హిట్ గా నిలుస్తుందో చూడాల్సి ఉంది. బలగం సినిమా సక్సెస్ సాధిస్తే కమెడియన్ వేణు దర్శకునిగా మరింత బిజీ అయ్యే అవకాశం అయితే ఉంది.

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus