బిగ్ బాస్ హౌస్ లో 11వ వారంలోకి హౌస్ మేట్స్ అందరూ కూడా అడుగుపెట్టారు. ఈ టైమ్ లో ఎలిమినేట్ అయిపోయిన సభ్యుల్లో ఒకరు రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇందులో సోషల్ మీడియాలో మాత్రం కుమార్ సాయి పేరు గట్టిగానే వినిపిస్తోంది. అయితే, కన్ఫార్మ్ న్యూస్ మాత్రం బిగ్ బాస్ టీమ్ నుంచి రావడం లేదు. అసలు ఎలిమినేట్ అయిపోయిన వారిని రీ ఎంట్రీ ఇప్పిస్తారా…? లేదా ? అనేది కూడా సస్పెన్స్ గానే ఉంది.
నిజానికి చాలాకాలం నుంచి బిగ్ బాస్ హౌస్ లో 12వ వారం లేదా 13వ వారం ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉండబోతోందనే టాక్ ఉంది. అప్పుడు సింగర్ మంగ్లీ పేరు కూడా బాగా వినిపించింది. మంగ్లీ క్వారైంటైన్ లో ఉంచారని, తర్వలో బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతోందని అన్నారు. కానీ , అది జరగలేదు. అయితే, ఇప్పుడు ఎలిమినేట్ అయిపోయిన ఇంటిసభ్యుల్లోనుంచి ఒకర్ని రీ ఎంట్రీ ఇప్పిస్తే ఎలా ఉంటుందని బిగ్ బాస్ టీమ్ ఆలోచిస్తోందట.
కానీ, ఆడియన్స్ దృష్టిలో చూస్తే హౌస్ మేట్స్ ఎవరైనా సరే ఇప్రీపుడు ఎంట్రీ ఇచ్చి వేస్ట్. ఇంకా మరికొన్ని వారాలు మాత్రమే టైమ్ ఉన్న ఈ టైమ్ లో ఇలా రీ ఎంట్రీ ద్వారా ఒకవేళ ఎవరైనా వస్తే, అది ఖచ్చితంగా ఇప్పుడున్న ప్లేయర్స్ గేమ్ ని దెబ్బతీసే అవకాశం ఉంటుంది.
ఎందుకంటే, నామినేషన్స్ లోకి స్ట్రాంగ్ ప్లేయర్స్ ముగ్గురు లేదా నలుగురు వస్తే రీ ఎంట్రీ ఇచ్చిన హౌస్ మేట్ నామినేషన్ లోకి రాకుండా సేఫ్ గేమ్ ఆడితే మరో స్ట్రాంగ్ ప్లేయర్ వెళ్లిపోయే అవకాశం ఉంటుంది. అంతేకాదు, ఫినాలే కోసం ఏదైనా టాస్క్ పెట్టినా , రీ ఎంట్రీ ఇచ్చినవాళ్లు అందులో గెలిచినా కూడా ఫస్ట్ నుంచి ఆడిన ప్లేయర్ ఎలిమినేట్ అయిపోతారు. అందుకే ఇది చాలా అన్ ఫెయిర్ అంటున్నారు బిగ్ బాస్ లవర్స్.
అలాకాకుండా బిగ్ బాస్ షోని మరో నాలుగైదు వారాలు పొడిగిస్తే ఈ రీ ఎంట్రీ అనేది సక్సెస్ అవుతుంది. ఇక రీ ఎంట్రీ ఇస్తే ఇప్పుడు ఎవరు వస్తారు అనేది కూడా ఆసక్తికరం. ప్రస్తుతం కుమార్ సాయి పేరు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. కానీ, ఫస్ట్ వీక్ ఎలిమినేట్ అయిపోయిన సూర్యకిరణ్ నుంచి రీసంట్ గా వెళ్లిపోయిన మెహబూబ్ వరకూ ఛాన్స్ ఉంది. దివి, దేవి, సుజాత, అమ్మరాజశేఖర్, కళ్యాణి, ఇలా అందరికీ కూడా ఈ అవకాశం ఉండచ్చనే అంటున్నారు. మరి చూద్దాం… ఏం జరుగుతుంది అనేది.. !