Khushboo: కమల్‌ – రజనీ సినిమా నుండి సుందర్‌.సి అవుట్‌.. ఏమైందో చెప్పిన కుష్బూ

కమల్‌ హాసన్‌ – రజనీకాంత్‌ కాంబినేషన్‌లో రెండు సినిమాలు తెరకెక్కుతున్నాయి. ఒక సినిమాలో రజనీకాంత్‌ హీరో అయితే, కమల్ హాసన్‌ నిర్మాత. మరో సినిమాలో ఇద్దరూ నటిస్తున్నారు కానీ.. ఎవరు హీరో, ఎవరు విలన్‌ అనేది తేలడం లేదు. ఇదే మాట ఆ సినిమా ప్రమోషనల్‌ వీడియోలో ఇటు రజనీ, అటు కమల్‌ అడిగారు కూడా. ఆ విషయం వదిలేస్తే హీరో – ప్రొడ్యూసర్‌ సినిమా గురించి తాజాగా మరోసారి చర్చ మొదలైంది. ప్రస్తుతం అశ్వత్‌ మరిముత్తు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. గతంలో ఆయన బదులు మరో ముగ్గురు దర్శకుల పేర్లు వచ్చాయి.

Khushboo

ఇందులో ఎలాంటి దాపరికం లేదు. ఎందుకంటే ఈ సినిమా అనౌన్స్‌మెంట్‌ ఈవెంట్‌లో రజనీకాంతే ఈ విషయం చెప్పుకొచ్చారు. అందులో ఓ దర్శకుడు ఆ సినిమా వద్దనుకునేటప్పుడు ఏం జరిగింది అనేది ఇప్పుడు టాపిక్‌. ఆయనే సి.సుందర్‌. ప్రముఖ నటి కుష్బూ భర్త ఆయన అనే విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్‌కు రెండో దర్శకుడు సుందర్‌. కానీ అనౌన్స్‌ అయిన కొన్ని రోజులకే ఆయన సినిమా నుండి తప్పుకున్నారు. కారణం చెప్పలేదు కానీ.. అప్పుడు ఏమైంది అని మాత్రం చెప్పారు కుష్బూ.

ఆ సినిమా గురించి నేను కామెంట్‌ చేయడం సరికాదు అని నా అభిప్రాయం. అయితే ఓ ప్రాజెక్టులో ఉండాలా వద్దా అనేది దర్శకుడు నిర్ణయమే. ఆయన ఏమనుకుంటే అలా చేయొచ్చు. నా భర్త సుందర్‌ కూడా ఇలాంటి ఓ ఆలోచనతోనే సినిమా నుండి బయటకు వచ్చారు. కమల్‌ – రజనీ సినిమాకు ఆయన దర్శకుడు అనేసరికి నేను చాలా ఎగ్జైట్‌ అయ్యాను. అయితే ఏమైందో ఏమో ఓసారి సుందర్‌ వచ్చి.. నేను ఆ సినిమా నుండి బయటకు వచ్చేస్తాను. ఆ విషయం ఒకసారి కమల్‌కి చెప్పేసేయ్‌ అని చెప్పారు అని కుష్బూ చెప్పారు.

కమల్‌ నా భర్తకు ప్రొడ్యూసర్‌ అవ్వొచ్చు. నాకు మాత్రం మిత్రుడే అని చెప్పారు కుష్బూ. మరి ఆ చనువుతోనే కుష్బూ చెప్పేసినట్లున్నారు. ఇదంతా తెలిసినా ఎందుకు ఆయన సినిమా చేయలేదు అనేది తెలియలేదు. ఆయన కాకుండా రవి కుమార్‌, సిబి చక్రవర్తి ఈ సినిమాలోకి వచ్చిన బయటకు వెళ్లిపోయిన దర్శకులు.

అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus