బాలీవుడ్ బ్యూటీ కైరా దత్ పేరు చెబితే పెద్దగా ఎవరికీ గుర్తుకు రాకపోచ్చు..కానీ రేసు గుర్రం సినిమాలో “బూచాడే బూచాడు” అనే పాట చెబితే మాత్రం టక్కున గుర్తొస్తుంది. బాలీవుడ్ లో అనేక చిత్రాల్లో నటించిన ఈ సుందరి. ఐటెం సాంగ్ ద్వారా తెలుగులోకి అడుగుపెట్టింది. కొత్త భామలను పరిచయం చేయడంలో దిట్ట అయిన పూరి జగన్నాథ్ కైరా దత్ ని పైసా వసూల్ లో కొత్తగా చూపించారు. టైటిల్ సాంగ్ లో కైరా తన డ్యాన్స్ తో పాటు అందాలతో కనువిందు చేసింది. దీంతో ఆమెకు చేతినిండా అవకాశాలు వచ్చాయి. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ “బాలీవుడ్ లో బోల్డ్ క్యారక్టర్లు చేశాను.
కానీ వాటి వల్ల రాని గుర్తింపు ఐటెంసాంగ్స్తోనే వచ్చింది. ఐటెంసాంగ్స్ చేస్తే వచ్చే కిక్కే వేరు. పాట కోసం వేసే సెట్టింగులు, ఆ మ్యూజిక్ వింటూంటేనే చెప్పలేనంత ఉత్సాహం వచ్చేస్తుంది. సినిమా హిట్ అయినా.. ఫెయిల్ అయినా. కొన్ని పాటలు మాత్రం ప్రేక్షకులకు గుర్తుండిపోతాయి.” అని చెప్పింది. ఇంకా కైరా మాట్లాడుతూ “ఉత్తరాదితో పోల్చుకుంటే దక్షిణాదిన నాకు మంచి గుర్తింపే వస్తోంది. ఇక్కడ వరుస అవకాశాలు వస్తున్నాయి.” అని ఆనందం వ్యక్తం చేసింది. తెలుగులో చాలా మంది హీరోలతో కలిసి పని చేయాలని ఉందని తన మనసులోని మాటను బయటపెట్టింది.