విజయ్ సేతుపతి, శృతిహాసన్ జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘లాభం’.నిజానికి ఎప్పుడో రావాల్సిన ఈ మూవీ కరోనా కారణంగా ఆలస్యంగా విడుదల కాబోతుంది. తెలుగు, తమిళ భాషల్లో ఏక కాలంలో ‘లాభం’ రిలీజ్ అవుతుంది.తెలుగులో క్రేజ్ సంపాదించుకున్న తర్వాత విజయ్ సేతుపతి హీరోగా నటించిన సినిమా ఇలా రిలీజ్ అవుతుండడం ఇదే మొదటిసారి. సెప్టెంబర్ 9న ఈ చిత్రం విడుదల కాబోతుంది.జగపతిబాబు, సాయి ధన్సిక కూడా కీలక పాత్రలు పోషిస్తున్న ఈ మూవీ పై మంచి అంచనాలే నెలకొన్నాయి. ఎస్.పి.జననాథన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని లాయర్ శ్రీరామ్ సమర్పణలో శ్రీ గాయత్రీ దేవి ఫిలిమ్స్ పతాకం పై నిర్మాత బత్తుల సత్యనారాయణ(వైజాగ్ సతీష్) తెలుగులో విడుదల చేస్తున్నారు.
ఈ చిత్రం తెలుగు థియేట్రికల్ బిజినెస్ వివరాలను ఓసారి గమనిస్తే :
నైజాం
0.30 cr
సీడెడ్
0.10 cr
ఆంధ్రా(టోటల్)
0.40 cr
ఏపి+తెలంగాణ (టోటల్)
0.80 cr
‘లాభం’ చిత్రాన్ని తెలుగులో చాలా వరకు ఓన్ రిలీజ్ చేసుకుంటున్నారు నిర్మాతలు. కొన్ని ఏరియాల్లో జరిగిన బిజినెస్ ను బట్టి.. ఈ చిత్రం క్లీన్ హిట్ గా నిలవాలి అంటే రూ.1 కోట్లు షేర్ ను రాబట్టాలి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అది చాలా కష్టమనే చెప్పాలి. ఎందుకంటే ఓటిటిలో టక్ జగదీష్, నెట్ వంటి క్రేజీ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఇక థియేటర్లలో ‘సీటీమార్’ వంటి క్రేజీ మూవీ రిలీజ్ అవుతుంది.