Janhvi Kapoor: గుడ్ లక్ అంటూ ప్రశంసలు కురిపించిన నయన్.. సంతోషంలో జాన్వీ!

  • August 6, 2022 / 06:58 PM IST

దివంగత నటి శ్రీదేవి కూతురిగా ధడక్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు నటి జాన్వీ కపూర్. ఈమె మొదటి సినిమాతోనే నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని అనంతరం పలు సినిమా అవకాశాలను అందుకొని బాలీవుడ్ ఇండస్ట్రీలో బిజీగా ఉన్నారు.ఇకపోతే తాజాగా ఈమె నటించిన గుడ్ లక్ జెర్రీ సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారమవుతుంది. ఈ క్రమంలోనే ఈ సినిమా విడుదలైనప్పటి నుంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడంతో

జాన్వీ కపూర్ ఇంటర్వ్యూలలో పాల్గొని ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. ఇక ఈమె నటించిన గుడ్ లక్ జెర్రీ సినిమా తమిళంలో నయనతార నటించిన కొలమావు కోకిల అనే సినిమాకి రీమేక్ చిత్రంగా తెరకెక్కింది. ఇక ఈ సినిమా విడుదల కావడంతో ఈ సినిమాపై నయనతార స్పందించినట్లు తాజాగా ఒక ఇంటర్వ్యూలో భాగంగా జాన్వీ కపూర్ ఈ విషయం గురించి వెల్లడించారు. ఈ సందర్భంగా జాన్వి మాట్లాడుతూ…

ఈ సినిమా ట్రైలర్ చూసిన నయనతార సానుకూలంగా స్పందించారని తెలిసి ఆమె నెంబర్ కనుక్కొని ధన్యవాదాలు అంటూ మెసేజ్ చేశానని తెలిపారు. అయితే తన మెసేజ్ కు నయనతార రిప్లై ఇవ్వడం ఎంతో సంతోషాన్ని కలిగించిందని ఈ సందర్భంగా తెలిపారు. నయనతార తన మెసేజ్ కు రిప్లై ఇస్తూ కెరియర్ ప్రారంభంలోనే నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు పోషిస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది అంటూ రిప్లై ఇవ్వడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని జాన్వీ వెల్లడించారు.

కోకిల నా మనసుకు చాలా దగ్గరైన పాత్ర గుడ్ లక్ జెర్రీ ట్రైలర్ చూడటం చాలా సంతోషాన్ని ఇచ్చిందని చెప్పడమే కాకుండా ఈ సినిమా విడుదలకు ముందు నయనతార తనకు గుడ్ లక్ అంటూ విషెస్ చెప్పినట్లు జాన్వీ ఈ ఇంటర్వ్యూ సందర్భంగా తెలియజేశారు.

బింబిసార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సీతారామం సినిమా రివ్యూ & రేటింగ్!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus