సినిమా పరిశ్రమను చాలా ఏళ్లుగా వెంటాడుతున్న విషయం నెపోటిజం. ఈ విషయంలో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. బాలీవుడ్‌లో చాలామంది పెద్దల పిల్లల్ని లాంచ్ చేసే కరణ్ జోహార్ విషయంలో ఈ ఆరోపణలు ఎక్కువగా వినిపిస్తుంటాయి. కంగన రనౌత్ లాంటివాళ్లయితే కరణ్ మీద తెగ విరుచుకుపడుతుంటారు. అయితే ఇలాంటి సమయంలో కరణ్‌కు దక్షిణాది నుంచి సపోర్టు వచ్చింది. కరణ్ జోహార్‌ను సమర్థిస్తూ మంచు లక్ష్మీ ఇటీవల మాట్లాడింది. నెపోటిజం ఓ చెత్త టాపిక్ అంటూ కొట్టి పడేసింది.
‘‘చక్కగా పని చేస్తున్న వ్యక్తుల్ని తక్కువ చేసి మాట్లాడటం ఏ మాత్రం సరికాదు. నెపోటిజం వల్లే వాళ్లకు అవకాశాలు వచ్చాయి అనడం సరికాదు’’ అని మంచు లక్ష్మి అంది. కరణ్ జోహార్‌కు నేను పూర్తిగా మద్దతిస్తున్నాను. ఆయన విషయంలో వస్తున్న విమర్శలు ఏ మాత్రం సరికాదు. ఏదైనా సినిమాకు నటీనటుల్ని ఎంపిక చేసుకునే క్రమంలో వాళ్ల వల్ల సినిమాకు లాభం ఉంటుందా లేదా అనేదే చూస్తారు. సినిమాకు డబ్బులు పెట్టేవాళ్లు ఆ మాత్రం చూసుకోకపోతే ఎలా. నటులు వచ్చి డబ్బులు తీసుకొని, నన్ను సినిమాకు పరిచయం చేయ్ అని అడగరు కదా అంటూ నెపోటిజం గురించి ఘాటుగా వ్యాఖ్యానించింది లక్ష్మి.
కరణ్ జోహార్ గురించి చెబుతూ.,.. ‘‘అతను తనను తాను చాలా సార్లు నిరూపించుకున్నాడు. సినిమాలో చాలా రంగాల్లో తన సత్తా చాటాడు. అలాంటి వ్యక్తి గురించి విమర్శలు చేయడం సరికాదు’’ అంది. నెపోటిజం గురించి టాలీవుడ్‌లోనూ విమర్శలు వినిపిస్తున్న వేళ మంచు లక్ష్మి ఇలా మాట్లాడం ఆసక్తికర చర్చకు దారి తీసింది. ఇప్పుడు ఆమె వాదనకు టాలీవుడ్‌లో ఎవరు అండగా నిలుస్తారో చూడాలి. అన్నింటికి మించి కంగన అండ్ కో ఏమంటుందో చూడాలి.
Most Recommended Video
2020 Rewind: ఈ ఏడాది సమ్మోహనపరిచిన సుమధుర గీతాలు!
కొన్ని లాభాల్లోకి తీసుకెళితే.. మరికొన్ని బోల్తా కొట్టించాయి!
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!