బాలయ్యకు అంత ధైర్యం ఉందా.. లక్ష్మీపార్వతి షాకింగ్ కామెంట్స్!

సీనియర్ ఎన్టీఆర్ రెండో భార్య లక్ష్మీ పార్వతి గురించి ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం వైసీపీలో ఉన్న లక్ష్మీ పార్వతి చంద్రబాబు, లోకేశ్ లపై చాలా సందర్భాల్లో తీవ్రస్థాయిలో విమర్శలు చేయడం ద్వారా వార్తల్లో నిలిచారు. తాజాగా ప్రముఖ యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన లక్ష్మీ పార్వతి ఆ ఇంటర్వ్యూ ప్రోమోలో ఒకింత షాకింగ్ కామెంట్లు చేయగా ఆ కామెంట్లు హాట్ టాపిక్ అవుతున్నాయి.

ప్రోమోలో నారా ఫ్యామిలీ నందమూరి ఫ్యామిలీని వాడుకుంటోందా అనే ప్రశ్నకు లక్ష్మీ పార్వతి స్పందిస్తూ నారా కుటుంబమే అధికారంలో ఉండాలని అనుకుంటోందని ఆమె తెలిపారు. లోకేశ్ పాదయాత్ర పూర్తిగా ఫెయిల్ అంటారా అనే ప్రశ్నకు లక్ష్మీ పార్వతి స్పందిస్తూ లోకేశ్ అనే వాడు కల్ప జంతువు అని అన్నారు. లోకేశ్ జూనియర్ ఎన్టీఆర్ ను టీడీపీలోకి ఆహ్వానించడంపై లక్ష్మీ పార్వతి స్పందిస్తూ నక్క సింహాన్ని పిలిచినట్టు ఉందని పేర్కొన్నారు.

చంద్రబాబు నాయుడు మోసం తెలుసు కాబట్టే జూనియర్ ఎన్టీఆర్ టీడీపీకి దూరంగా ఉంటున్నాడని లక్ష్మీ పార్వతి అభిప్రాయం వ్యక్తం చేశారు. నాతో కలిసి అన్ స్టాపబుల్ షో చేస్తానని చెప్పేంత ధైర్యం బాలయ్యకు ఉందా అంటూ లక్ష్మీ పార్వతి ప్రశ్నించారు. సినిమాలోనే బాలయ్య నా పాత్రను చూపించలేకపోయారని లక్ష్మీ పార్వతి కామెంట్లు చేయడం గమనార్హం. విధి వశమున నీ చెంతకు మధుపమురా పద్యమును చెప్పి లక్ష్మీపార్వతి ఒకింత ఆశ్చర్యపరిచారు.

బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్ గురించి లక్ష్మీ పార్వతి చేసిన కామెంట్లు హాట్ టాపిక్ అవుతున్నాయి. ఈ కామెంట్ల గురించి టీడీపీ నేతల నుంచి కానీ బాలయ్య నుంచి కానీ రియాక్షన్ వస్తుందేమో చూడాల్సి ఉంది. లక్ష్మీ పార్వతి కామెంట్లను పట్టించుకోవాల్సిన అవసరం లేదని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus