రామ్ గోపాల్ వర్మ ఒకచోట ఉన్నాడంటే అక్కడ ఏదో ఒక వివాదం ఉండి తీరాల్సిందే. అయితే వర్మ ‘ఎన్టీఆర్’ బయోపిక్ కి ధీటుగా `లక్ష్మీస్ ఎన్టీఆర్’ అనే సినిమా తీస్తున్నాడనే విషయం తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించి లక్ష్మి పార్వతితో భేటీ అయిన వర్మ ఆమె అంగీకారంతో సినిమాని మొదలుపెట్టగా, ఈ సినిమా ప్రారంభోత్సవానికి కూడా లక్ష్మి పార్వతి వచ్చింది. ఈ సినిమాకి సంబంధించి స్క్రిప్ట్ విషయంలో ఆమె ఒక కండిషన్ పెట్టగ దాన్ని వర్మ అస్సలు లెక్కచేయడం లేదని అంటున్నారు. ఇదేవిషయం పైన మీడియా ముందు కూడా వర్మ డైరెక్ట్ గా చెప్పేసాడు.
లక్ష్మి పార్వతి సినిమా తీసేముందు తనకి ఒకసారి పూర్తి స్క్రిప్ట్ చూపించాలని కండిషన్ పెట్టిందంటా. కానీ వర్మ మాత్రం స్క్రిప్ట్ ఆమెకి చూపించాల్సిన అవసరం నాకు లేదని తేల్చేసాడు. ఒక సందర్భంలో మీడియా ముందుకు వచ్చిన వర్మ ఒక కథని ఆమెకి చెప్పి మరొక కథ తీస్తే ఎలా ఉంటుంది, అందుకే నన్ను ఆవిడా నమ్మితే చాలు అంతేకాని స్క్రిప్ట్ మాత్రం చూపించను అని అనేశాడు. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ గారి చీకటి కోణాన్ని బయటపెడతా అంటూ వర్మ ఇప్పటికే చెప్పేసాడు. ఈ సినిమాలో స్టార్స్ ఎవరు యాక్ట్ చేయరని, కొత్త వారితోనే తీస్తే కథకి బాగుంటుందని వర్మ భావిస్తున్నాడు. మరి రిలీజ్ కి ముందే ఇలా ఉంటె సినిమా రిలీజ్ తరువాత ఈ బయోపిక్ ఎలాంటి సంచలనాలకు దారితీస్తుందో చూడాలి.