సూపర్ స్టార్ రజినీకాంత్ కీలక పాత్రలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘లాల్ సలాం’. విష్ణు విశాల్ – విక్రాంత్..లు హీరోలుగా నటిస్తున్న ఈ సినిమాని రజనీకాంత్ కూతురు ఐశ్వర్య రజనీకాంత్ డైరెక్ట్ చేస్తున్నారు. ‘లైకా ప్రొడక్షన్స్’ బ్యానర్ పై సుబాస్కరన్ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.ఓ గ్రామం, ఆ గ్రామానికి చెందిన కుర్రాళ్ళు.. వాళ్ళ క్రికెట్ జీవితం, రాజకీయ కుట్రలు.. ప్రధానంగా ఈ సినిమా రూపొందినట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో కపిల్ దేవ్ కూడా కీలక పాత్ర పోషించడం ఆకర్షించే అంశం.
తాజాగా ‘లాల్ సలాం’ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ని కొద్దిసేపటి క్రితం రిలీజ్ చేశారు. 2 నిమిషాల 27 సెకన్ల నిడివి కలిగిన ‘లాల్ సలాం’ ట్రైలర్లో.. ‘ ఒక ఊరు, అక్కడ కుర్రాళ్ళ మధ్య ఘర్షణలు, వారి క్రికెట్ లైఫ్ ను చూపించారు అని చెప్పాలి. విష్ణు విశాల్ యాక్షన్ సీన్స్ లో అదరగొట్టేలా కనిపిస్తున్నాడు. అటు తర్వాత రజనీ ఎంట్రీ ఇచ్చారు. మోయినుద్దీన్ భాయ్ అనే ముస్లిం వ్యక్తిగా రజినీ ఈ సినిమాలో కనిపించబోతున్నారు. ఆమె సోదరిగా జీవిత నటించడం ఇంకో చెప్పుకోదగ్గ అంశం.
‘బాయ్ 90 లలో భాషా రా’ అనే డైలాగ్ ఆకట్టుకుంటుంది. అలాగే రజినీకాంత్ తో మరికొన్ని ఇన్స్పిరేషనల్ డైలాగ్స్ ను చెప్పించారు. కాకపోతే రజినీకాంత్ కి సాయి కుమార్ డబ్బింగ్ చెప్పడం అనేది ఆకట్టుకునే విధంగా లేదు అనే చెప్పాలి. గతంలో రజినీకాంత్ ‘పెదరాయుడు’ ‘బాషా’ లో చేసిన పాత్రలకి సాయి కుమారే డబ్బింగ్ చెప్పినప్పటికీ.. ఎందుకో ఈసారి కొంచెం వింతగా అనిపించింది.సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ అందించిన బిజీయం బాగానే ఉంది. (Lal Salaam) ట్రైలర్ ను మీరు కూడా ఓ లుక్కేయండి :
అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా రివ్యూ & రేటింగ్!
మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
బూట్‌కట్ బాలరాజు సినిమా రివ్యూ & రేటింగ్!