Lasya: ఆందోళనలో యాంకర్ లాస్య.. ఏమైందంటే..?

  • March 7, 2023 / 04:36 PM IST

యాంకర్ లాస్య రెండోసారి గర్భవతి అయినట్లు ప్రకటించి చాలా రోజులు అయిన సంగతి తెలిసిందే.ఆమె సీమంతం ఫోటోలను కూడా షేర్ చేసింది. ఇక లాస్యకి ఇప్పుడు తొమ్మిదో నెల.ఈ క్రమంలో కడుపులో బిడ్డ ఆమెను గందరగోళానికి గురి చేస్తున్నాడని తెలిపి అందరికీ షాకిచ్చింది. అంతేకాదు ఆమెను కాళ్ళతో తంతున్నాడట. ఆ మార్పు స్పష్టంగా తెలుస్తుందని లాస్య తన సోషల్ మీడియాలో చెప్పుకొచ్చింది. 8వ నెలలో కంటే కూడా 9వ నెలలో బిడ్డ కదలికలు ఎక్కువగా ఉన్నాయట.

ఇన్స్టాగ్రామ్లో ఓ వీడియో ద్వారా లాస్య ఈ విషయాలను చెప్పుకొచ్చింది.9వ నెలలోకి అడుగుపెట్టింది అంటే ఆమెకు నెలలు నిండినట్టే..! త్వరలోనే ఆమె పండంటి బిడ్డకు జన్మనివ్వబోతుంది అని స్పష్టమవుతుంది. ఓ యాంకర్ గా కెరీర్ ను మొదలుపెట్టిన లాస్య.. మంజునాథ్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరి పెళ్ళికి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు. దీంతో ప్రైవేటు గా పెళ్లి చేసుకున్నారు. అటు తర్వాత లాస్య ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో రెండు సార్లు అబార్షన్ చేయించుకున్నట్టు బిగ్ బాస్ హౌస్ లో చెప్పుకొచ్చింది.

ఇక తనకు పిల్లలు పుట్టరేమో అనుకున్న టైంలో తనకు అబ్బాయి పుట్టినట్టు ఆమె చెప్పుకొచ్చింది. అదే క్రమంలో పెద్దలు లాస్యని తన భర్తను చేరదీసి మళ్ళీ పెళ్లి చేసినట్టు కూడా చెప్పుకొచ్చింది. స్టార్ మా.. ‘మా టీవీగా పిలవబడే రోజుల్లో ఈమె సంథింగ్ స్పెషల్ అనే షోని యాంకర్ రవితో కలిసి హోస్ట్ చేసింది. ఆ షో వల్ల ఈమె బోలెడంత క్రేజ్ ను సంపాదించుకుంది.

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus