యాంకర్ రవితో వచ్చిన గొడవ గురించి చెప్పిన లాస్య

  • February 10, 2017 / 01:39 PM IST

బుల్లితెరపై రవి, లాస్య జోడి కొంతకాలంగా అలరించింది. వీరి మధ్య చనువు చూసి చాలామంది ప్రేముకులని పొరబడ్డారు. పెళ్లికూడా చేసుకున్నారని పుకార్లు పుట్టించారు. ఆ రూమర్లకు చెక్ చెబుతూ జనవరి 30 న మహారాష్ట్రకు చెందిన మంజునాథ్ అనే వ్యక్తి తో నిశ్చితార్ధం చేసుకొని, ఆ ఫోటోలను అందరితో లాస్య పంచుకున్నారు. తాజాగా ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూ లో తోటి యాంకర్ రవి గురించి కొన్ని సంచలన కామెంట్స్ చేసారు. రవి తనకు రియల్ లైఫ్ ఫ్రెండ్ కాదని, కేవలం ప్రొఫిషనల్ ఫ్రెండ్ మాత్రమేనని స్పష్టం చేశారు. డీజే షో చేస్తున్నప్పుడే తామిద్దరి మధ్య గొడవ వచ్చిందని, తనకి లైఫ్ ఇచ్చానని రవి చులకనగా మాట్లాడడంతో అతనితో స్నేహం కట్ చేసినట్లు వెల్లడించారు.

రవిని ప్రేమించలేదా ? అని అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. ఇదివరకే పెళ్లి అయిన వ్యక్తితో తాను ప్రేమలో ఎలా పడతానని ప్రశ్నించారు. “మంజు నా సోల్ మేట్, మేమిద్దరం పెళ్లిచేసుకోబోతున్నామని చెప్పిన తర్వాత కూడా సోషల్ మీడియాలో మా ఫోటోల పక్కన రవి ఫోటో పెడుతుంటే.. ఇప్పటికైనా వదలరా? అని గట్టిగా అరవాలనిపిస్తోంది” అంటూ రవిపై ఉన్న అసహ్యాన్ని లాస్య బయటపెట్టారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus