Akhil: అఖిల్ విలన్ ని మార్చేశారట!

Advertisement

అక్కినేని అఖిల్-సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న సినిమా ‘ఏజెంట్’. మమ్ముట్టి కీలకపాత్ర పోషిస్తున్న ఈ సినిమా షూటింగ్ కొంతవరకు పూర్తి చేసుకుంది. అయితే జరిగిన షూటింగ్ దానికి మళ్లీ రిపేర్లు చేస్తున్నట్లు సమాచారం. సురేందర్ రెడ్డికి కరోనా సోకడంతో.. ‘ఏజెంట్’ షూటింగ్ కి బ్రేక్ పడింది. ఈ గ్యాప్ లో స్క్రిప్ట్ ను మరింత పకడ్బందీగా తీర్చిదిద్దే క్రమంలో కొన్ని మార్పులు, చేర్పులు చేసినట్లు సమాచారం. అందులో భాగంగా విలన్ పాత్రధారిని మార్చేశారు.

Click Here To Watch

ఈ సినిమా కోసం ఇది వరకు బాలీవుడ్ విలన్ ను తీసుకున్నారు. ఆయనపై కొన్ని సన్నివేశాలను తెరకెక్కించారు. అయితే అతడి స్క్రీన్ ప్రెజన్స్ నచ్చకపోవడంతో.. ఇప్పుడు ఆ విలన్ ను పక్కన పెట్టి, మరో విలన్ ను తీసుకునే పనిలో పడ్డారు. కొత్త విలన్ వచ్చిన తరువాత పాత విలన్ పై తీసుకున్న సన్నివేశాలను రీషూట్ చేయాల్సివస్తుంది. షూటింగ్ కొంతవరకే జరిగింది కాబట్టి రీప్లేస్‌మెంట్ జరిగినా.. పెద్దగా నష్టం లేదు. ఎ.కె.ఎంట‌ర్‌టైన్మెంట్ బ్యాన‌ర్‌పై అనీల్ సుంక‌ర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ స్పై థ్రిల్ల‌ర్‌లో అఖిల్ జోడీగా సాక్షి వైద్య న‌టిస్తుంది. బ‌డ్జెట్ దృష్ట్యా ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో విడుద‌ల చేస్తారో లేక టాలీవుడ్‌కే ప‌రిమితం చేస్తారో చూడాలి. అఖిల్‌ నటించిన ‘హ‌లో’, ‘మిస్ట‌ర్ మ‌జ్ను’ చిత్రాలకు మంచి టాక్ వచ్చినా.. అక్కినేని అభిమానులు ఆశించిన స్థాయి విజయాన్ని మాత్రం అఖిల్ అందుకోలేక‌పోయారు. అయితే గీతాఆర్ట్స్ 2 బ్యాన‌ర్‌లో చేసిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్‌’తో తొలి స‌క్సెస్ అందుకున్న అఖిల్ ఆ జోరుని కంటిన్యూ చేస్తారో లేదో చూడాలి!

గుడ్ లక్ సఖి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!
‘పుష్ప’లో 20కిపైగా తప్పులు… చూశారా!
అన్ని హిట్లు కొట్టినా చైతన్య స్టార్ ఇమేజ్ కు దూరం… ఆ 10 రీజన్స్ వల్లేనట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus