గ్లామర్ డోస్ పెంచనున్న లావణ్య త్రిపాఠి

  • June 8, 2016 / 12:13 PM IST

“అందాల రాక్షసి” సినిమాతో తన కెరీర్ ను మొదలెట్టిన లావణ్య త్రిపాఠికి ఆ సినిమాతో నటిగా మంచి మార్కులు లభించాయి కానీ.. అవకాశాలు మాత్రం రాలేదు. కొంత విరామం అనంతరం ఒక్కసారిగా “భలే భలే మగాడివోయ్, సోగ్గాడే చిన్ని నాయన” చిత్రాలతో వరుస విజయాలు అందుకొని క్రేజీ హీరోయిన్ గా రూపాంతరం చెందింది. ఆ తర్వాత వచ్చిన “లచ్చిందేవికి ఓ లెక్కుంది” ఫ్లాపాయినప్పటికీ.. ఆ సినిమా ఎఫెక్ట్ ఆమెపై ఎక్కువగా పడలేదు. ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో “శ్రీరస్తు శుభమస్తు, మిస్టర్” మరియు శర్వానంద్ సినిమాలున్నాయి. ఇవి కాకుండా మరికొన్ని సినిమా పైప్ లైన్ లో ఉన్నాయి.

ఇకపోతే.. ఇప్పటివరకూ నటించిన అన్నీ సినిమాల్లోనూ కాస్త పద్ధతిగానే కనిపించింది. అందాల ఆరబోతకు పెద్దగా ఆస్కారం లభించలేదు. అయితే.. తాజా సినిమా “మిస్టర్” మరియు శర్వానంద్ సినిమాలో తన సొగసుల సత్తా చాటేందుకు సమాయత్తమవుతోంది లావణ్య. సో, నిన్నటివరకూ తన అభినయ సామర్ధ్యంలో అలరించిన లావణ్య.. ఇకనుంచి అందాల ఆరబోతతో ఆకట్టుకోనుందన్నమాట. మరి లావణ్య పెంచుతున్న గ్లామర్ డోస్ ఆమె కెరీర్ కు ఏ విధంగా ప్లస్ అవుతుందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus