Lavanya Tripathi: గడ్డకట్టే చలిలో ఎంజాయ్ చేస్తున్న వరుణ్ లావణ్య?

  • December 8, 2023 / 07:45 PM IST

మెగా న్యూ కపుల్స్ వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి ఇద్దరూ కూడా ప్రస్తుతం హనీమూన్ లో ఉన్న సంగతి మనకు తెలిసిందే. వీరిద్దరూ కొద్దికొంత కాలంలో ప్రేమలో ఉంటూ నవంబర్ ఒకటవ తేదీ పెద్దల సమక్షంలో ఎంతో ఘనంగా ఇటలీలో వివాహం చేసుకున్నారు. ఇలా పెళ్లి చేసుకున్న ఈ జంట ఇటీవల హనీమూన్ కి వెళ్లారు. అయితే మీరు హనీమూన్ కి వెళ్తున్న సమయంలో ఎయిర్ పోర్టులో దిగినటువంటి ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ఇలా ఈ ఫోటోలను షేర్ చేసిన ఈ కపుల్స్ ఎక్కడికి వెళ్లారనే విషయాలను మాత్రం వెల్లడించలేదు. అయితే తాజాగా వీరు హనీమూన్ కి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వచ్చారు. తాజాగా లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) ఒక ఫోటోని షేర్ చేశారు. అయితే మైనస్ 10 డిగ్రీల చలి ఉన్నటువంటి ప్రదేశంలో వీరు ఎంజాయ్ చేస్తున్నారని తెలుస్తోంది.

ఇలా గడ్డకట్టే మంచు కురుస్తున్నటువంటి ప్రదేశంలో హనీమూన్ వెళ్లారు. మరి వీరిద్దరూ ఏ ప్రదేశానికి వెళ్లారు అనే విషయానికి వస్తే ఫిన్లాండ్ దేశంలోని ల్యాప్ లాండ్ అనే ఏరియాకు వెళ్లారు. ఆల్మోస్ట్ ఆర్కిటిక్ కి దగ్గరగా ఉన్న ప్రదేశానికి వెళ్లారు. అక్కడ -10 డిగ్రీల చలిలో, మంచు కురుస్తుంటే ఎంజాయ్ చేస్తూ ఇద్దరూ విడివిడిగా ఫోటోలు కూడా పోస్ట్ చేశారు.

ఆర్కిటిక్ సర్కిల్ అని ఉన్న ఓ ఫోటోని కూడా వరుణ్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేశాడు. దీంతో ఈ జంట అత్యంత చల్లని ప్రదేశమైనటువంటి ఫిన్లాండ్ వెళ్లారని తెలుస్తుంది. అయితే గతంలో ఈ ప్రదేశానికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఉపాసన దంపతులు కూడా ఇక్కడికి హనీమూన్ వెళ్లారు అలాగే అల్లు అర్జున్ స్నేహ రెడ్డి దంపతులు కూడా ఫిన్లాండ్ హనీమూన్ కోసం వెళ్లారని తెలుస్తుంది. తాజాగా వీరి ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus