సెన్సిబుల్ చిత్రాల తో ప్రేక్షకుల్ని ఆకట్టుకొంటూ.. నటుడిగా, సంగీత దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకమైన పంధాను ఏర్పరుచుకొన్న విజయ్ ఆంటోనీ నటించిన తాజా చిత్రం “కాశి”. విజయ్ ఆంటోనీ సరసన అంజలి, సునైన కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని లెజండ్ సినిమా పతాకంపై ఉదయ్ హర్ష వడ్డెల, గణేష్ పెనుబోతు, ప్రధ్యుమ్న చంద్రపతి తెలుగులో విడుదల చేయనున్నారు. భారీ పోటీ నడుమ అత్యధిక మొత్తం చెల్లించి ఈ చిత్రాన్ని దక్కించుకొన్నారు. తెలుగు-తమిళ భాషల్లో మే 18న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతొంది.
వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం ట్రైలర్, సాంగ్స్ ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ చేశాయని నిర్మాతలు ఉదయ్ హర్ష వడ్డెల, గణేష్ పెనుబోతు, ప్రధ్యుమ్న చంద్రపతి చెప్పారు.