K Viswanath: కళాతపస్వి కె. విశ్వనాథ్ గారి చివరి ఫోటోలు.. వైరల్

  • February 3, 2023 / 11:39 AM IST

టాలీవుడ్ కు మరో పెద్ద షాక్ తగిలింది. ప్రముఖ దర్శకుడు,గొప్ప నటుడు అయిన కళాతపస్వి కాశీనాధుని విశ్వనాథ్‌ అలియాస్ కె.విశ్వనాథ్‌ గారు నిన్న రాత్రి కన్నుమూశారు. ఆయన వయసు 92 సంవత్సరాలు. గత కొన్ని రోజులుగా వయసు రీత్యా వచ్చిన అనారోగ్య సమస్యలతో పోరాడుతున్న ఆయన.. పరిస్థితి విషమించడంతో కన్నుమూశారు. చికిత్స పొందుతూనే ఆయన మరణించినట్టు స్పష్టమవుతుంది. విశ్వనాథ్ గారి మరణంతో తెలుగు సినీ పరిశ్రమలో ఒక శకం ముగిసినట్టు అయ్యింది.

విశ్వనాథ్ గారి మరణ వార్త తో టాలీవుడ్ లో విషాద ఛాయలు అల్లుకున్నాయి. విశ్వనాథ్ గారు తన ఫ్యామిలీని మీడియాకి గానీ, సోషల్ మీడియాకి గానీ చాలా దూరంగా ఉంచుతారు. అయితే మొన్నామధ్య విశ్వనాథ్ గారి శిష్యులలో ఒకరైన యూనివర్సల్ హీరో కమల్ హాసన్.. విశ్వనాథ్ గారి ఇంటికి వెళ్ళి తన గురువును సత్కరించి వచ్చారు. ఆ టైంలో తీసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇవే విశ్వనాథ్ గారి చివరి ఫోటోలు కావడం గమనార్హం. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి:

2008 లోనే హనీ రోజ్ చేసిన తెలుగు సినిమా ఏదో తెలుసా ??
నటి శృతి హాసన్ పాడిన 10 పాటలు ఇవే!

షారుఖ్-సల్మాన్ కలిసొచ్చినా… బాహుబలి, ఆర్ఆర్ఆర్, కెజిఫ్ లను కొట్టలేకపోయారు!
కాంబినేషన్ మాత్రం క్రేజీ – కానీ అంచనాలు మించే సినిమాలు అవుతాయి అంటారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus